Begin typing your search above and press return to search.
పుట్టే బిడ్డను కొడుకు గా మారుస్తానన్నాడు.. తలలో రెండు అంగుళాల మేకు..!
By: Tupaki Desk | 11 Feb 2022 9:30 AM GMTకాలం మారింది. సాంకేతికత పెరిగింది. మానవ జీవన విధానంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. అయినా కూడా కొందరి మూఢ నమ్మకాలు అలాగే ఉంటున్నాయి. కొడుకు మాత్రమే పుట్టాలని ఎంతోమందిని అనుకుంటున్నారు. అందుకు నానా విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు దొంగ బాబాలను ఆశ్రయిస్తున్నారు.
తర్వాత ఆర్థికంగా, శారీరకంగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. పుట్టబోయే బిడ్డను అబ్బాయిగా మారుస్తానని నమ్మించాడు ఓ బాబా. తలలోని మేకు దించితే.. కచ్చితంగా కొడుకు పుడతాడని నమ్మబలికాడు. బాబా చెప్పినట్టు చేసిన ఆ మహిళ... ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
పాకిస్తాన్ పెషావర్ కు చెందిన ఓ మహిళ కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె నాలుగో సారి గర్భం దాల్చింది. అయితే ఈసారి అయినా కొడుకు పుట్టాలని గట్టిగా కోరుకుంది. అబ్బాయి పుట్టకపోతే భర్త వదిలేస్తానని బెదిరించడం కూడా ఆమె భయానికి ఆజ్యం పోసింది. ఫలితంగా కడుపులోని బిడ్డ ఆడా? మగా? అని రోజూ భయపడేది. కడుపులో పిండం పడినప్పటి నుంచి ఇదే ఆలోచనతో సతమతమయ్యేది. కొడుకు పుట్టడం కోసం అనేక మార్గాలను శోధించసాగింది. నెలలు గడుస్తున్నా కొద్దీ క్షణమొక యుగంలా గడిపింది. చివరకు ఆమెకు ఓ బాబా ఆచూకీ తెలిసింది.
గర్భిణీకి ఎవరో ఆ బాబా వివరాలను చెప్పారు. ఆమె అతడిని ఆశ్రయించింది. తనకు కొడుకు పుట్టాలని కోరుకుంది. కాగా ఆ నకిలీ బాబా ప్రాణాంతకమైన సలహా ఇచ్చాడు. అసాధారణ పని చేయాలని ఆమెకు సూచించాడు. గర్భిణీ తలపై పదునైన మేకు దించితే.. కచ్చితంగా కొడుకే పుడుతాడని ఆమెను నమ్మించాడు. ఒకవేళ గర్భంలో అమ్మాయి ఉన్నా కూడా.. మారి అబ్బాయే పుడతాడని ఆ బాబా చెప్పినట్లుగా బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కుమారుడు పుట్టడం కోసం ఆమె ఆ సాహసానికి ఒడిగట్టింది.
నాలుగో కాన్పులోనైనా తనకు బాబు పుట్టాలని గట్టిగా సంకల్పించింది. అందుకే ప్రాణాంతకమైన సాహసానికి సైతం వెనుకాడలేదు. బాబా చెప్పినట్లే చేసింది. పదునైన మేకు తలలో దిగగానే ఆమె విలవిల్లాడిపోయింది. దాంతో బాధితులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పెషావర్ లోని లేడీ రీడింగ్ ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. స్కానింగ్ ఆధారంగా మేకును పరిశీలించారు. అది మెదడును చేరలేదని... తలలో బలంగా దిగిందని చెప్పారు. అంతేకాకుండా ఈ సంఘటనపై ఆరా తీశారు. బాబా చెప్పిన మాటను నమ్మి.. ఇదంటా చేశారని తెలిసి... ఆ వైద్యుడు ఆశ్చర్యానికి గురయ్యారు.
దీనిపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని పెషావర్ పోలీసులు అంటున్నారు. మేకు తలలో దిగిన స్కానింగ్ ఫొటో... సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం బాధితురాలి ఇంట్లోనే జరిగిందని... ఆ మేకును ఆమె కొట్టుకుందా? లేక ఎవరైనా కొట్టారా? స్పష్టత లేదని వెల్లడించారు. మరోవైపు నకిలీ బాబా కోసం గాలిస్తున్నారు.