Begin typing your search above and press return to search.
పకోడీ వ్యాపారి చేత అంత పన్ను కట్టించారు?
By: Tupaki Desk | 7 Oct 2018 5:27 AM GMTఅతడు చేసేది పకోడీ వ్యాపారం. అలా అని అతన్ని చిన్నగా చూసినా.. చులకన చేసినా తర్వాత బాధ పడాల్సిందే. ఎందుకంటే.. అతగాడి ప్రొఫైల్ తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. పకోడీ వ్యాపారం చేస్తున్నా.. లక్షలాది రూపాయిల్ని సంపాదించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మాత్రమే కాదు.. అతగాడు ఎగ్గొట్టిన పన్ను మొత్తాన్ని లెక్క కట్టి.. అతడికి ఫైన్ వేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇంతకీ.. ఇదంతా జరిగింది ఎక్కడంటారా? అక్కడికే వస్తున్నాం. పంజాబ్ లోని లూథియానాలో ఒక పకోడీ వ్యాపారి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అతగాడు చేసే పకోడీ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా సాగటమే కాదు.. ఎప్పుడూ కిటకిటలాడిపోతుంటుంది.
ఇతగాడు అమ్మే పకోడీల కోసం సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకూ క్యూ కట్టేస్తుంటారు. 1952లో చిన్న కొట్టుగా స్టార్ట్ అయిన ఈ పకోడీ వ్యాపారం ఇప్పుడు భారీగాపెరటమే కాదు.. వ్యాపారాన్ని ఓ రేంజ్లో పెంచేశాడు. తాజాగా అతగాడి ఆస్తులు.. ఆదాయం గురించి ఐటీ శాఖ వారు దృష్టి సారించారు. అతడి వ్యాపారాన్ని.. ఆదాయాన్ని లెక్క కట్టిన వారికి నోటి వెంట మాట రాలేదు.
సదరు పకోడీ వ్యాపారి ఆదాయం భారీగా ఉండటమే కాదు.. అతగాడు ప్రభుత్వానికి కట్టకుండా ఎగ్గొట్టిన పన్ను ఏకంగా లక్షల్లోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అతగాడికి రూ.60లక్షల జరిమానాను విధించారు. ఈ కేసు నుంచి బయపడేందుకు వీలుగా అధికారులు విధించిన రూ.60లక్షల ఫైన్ ను కట్టేశాడట పకోడీ వ్యాపారి. ఇదిలా ఉంటే.. లూథియానాకు చెందిన మరో డ్రై ఫ్రూట్స్ వ్యాపారి అయితే.. తన ఆదాయంలో ఏకంగా కోటి రూపాయిల మేర పన్ను కట్టకుండా ఎగ్గొట్టాడట. అతడిపైతనిఖీలు నిర్వహించిన అధికారులు.. కోటి ఫైన్ వేసి కట్టించుకున్నారు అధికారులు. సో.. పకోడి వ్యాపారమే కదా అని చులకనగా చూడొద్దు సుమా!