Begin typing your search above and press return to search.

కమల్.. రజనీల ను తిట్టాలంటే శివాజీ గణేశ్ ను విమర్శించాలా పళని?

By:  Tupaki Desk   |   13 Nov 2019 7:15 AM GMT
కమల్.. రజనీల ను తిట్టాలంటే శివాజీ గణేశ్ ను విమర్శించాలా పళని?
X
అక్కసు తో మాట్లాడే మాటలు అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పుతాయి. అందుకే.. ఎమోషన్ లో ఉన్నప్పుడు వీలైనంత మౌనం గా ఉండటానికి మంచి మందు మరొకటి ఉండదు. తనకు తాను రాజకీయ తోపు గా ఫీలవుతున్న తమిళనాడు ముఖ్య మంత్రి పళని స్వామి.. తాజా గా ప్రముఖ సినీ నటులు.. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే వస్తున్న కమల్.. రజనీకాంత్ లను ఉద్దేశించి తాజాగా చేసిన విమర్శలు ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కి కొత్త తల నొప్పులు తెచ్చి పెడతున్నాయి.

వెండితెర వేల్పులుగా ఉన్న ఈ ఇద్దరు నటులు రాజకీయా ల్లో ప్రవేశించిన వైనాన్ని పళని స్వామి ఎటకారం చేశారు. వారిద్దనిరి రాజకీయ అజ్ఞానులంటూ నోరు పారేసుకున్నారు. అక్కడి తో ఆగినా బాగుండేది.. ఈ ఇష్యూ తో ఏ మాత్రం సంబంధం లేని మరో అగ్ర నటుడు శివాజీ గణేశన్ ప్రస్తావన తెచ్చి తన కు తాను వివాదం లో కూరుకు పోయారు. సేలం జిల్లా పార్టీ నేతల తో సమీక్ష నిర్వహించిన ఆయన.. మీడియా తో మాట్లాడారు.

ఈ సందర్భం గా ఆత్మ విశ్వాసంతో మాట్లాడిన మాటలు ఓకే అయినా.. సంబంధం లేని రీతిలో కమల్.. రజనీకాంత్ ల మీద సంధించిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీకి విజయవకాశాలు మెండుగా ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్న కమల్ హాసన్ పై సీఎం పళని స్వామి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ప్రజాదరణ మెండుగా ఉంటే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ ఎందుకు బరి లోకి దిగ లేదని ప్రశ్నించారు. కమల్ పెద్ద నేత కదా? గడిచిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? అని ప్రశ్నించిన ఆయన.. ఈ సందర్భంగా కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

కమల్ కు వయసు దాటిపోయి వృద్ధాప్య దశ లోకి చేరు కోవటంతో సినిమా అవకాశాలు రాక రాజకీయాల్లోకి వచ్చారన్నారు. సినిమాలు సక్సెస్ కాక పోవటంతో పార్టీ పెడితే.. తమ పార్టీ వారైనా చూస్తారన్న ఆశ తో పార్టీ పెట్టినట్లు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం లో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు కానీ.. ఇతరులను దూషించటం తప్పు అని పెద్ద మనిషిగా మాట్లాడిన పళని స్వామి చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు.

కమల్ ను.. రజనీకాంత్ పై విమర్శలు గుప్పించే క్రమం లో నాటి అగ్ర నటుడు శివాజీ గణేశ్ ను ఉద్దేశించి సీఎం పళని స్వామి చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రజా సమస్యల మీద అవగాహన లేకుండా పార్టీ పెట్టిన ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ ఏమయ్యారో అందరికి తెలుసంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఉన్న కమల్ ను.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రజనీని ముఖ్య మంత్రి విమర్శించటాన్ని అర్థం చేసుకోవచ్చుకానీ.. ఈ విషయంలో ఏ మాత్రం సబంధం లేని శివాజీ గణేశ్ ను ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? ఆయన్ను చిన్నబుచ్చుతూ మాట్లాడటం ఏమిటంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు.

పళని స్వామి లా కాళ్ల మీద పడి పోయి పదవులు తీసుకోలేదంటూ శివాజీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రాజకీయాల్లో తనకున్న అనుభవం గురించి గొప్పగా చెప్పుకుంటున్న పళని స్వామి.. కమల్.. రజనీలను తిట్టటానికి.. వారిని తక్కువ చేయాలన్నదే లక్ష్యమైతే.. మధ్యలో సంబంధం లేని శివాజీ గణేషన్ ను తీసుకొచ్చి అడ్డంగా బుక్ కావటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తోపు అన్నప్పుడు ఆ స్థాయి కి తగ్గట్లు మాట్లాడాలన్న విషయాన్ని సీఎం పళనిస్వామి కి గుర్తు చేయాలంటారా?