Begin typing your search above and press return to search.
పళని ఎన్టీఆర్.. పన్నీర్ నాదెండ్ల..?
By: Tupaki Desk | 16 Feb 2017 4:43 AM GMTగడిచిన పది.. పన్నెండేళ్లుగా రాజకీయాల్ని ఫాలో అయ్యే వారికి ఎన్టీఆర్ అంటే ఓకే కానీ.. నాదెండ్ల పేరు విన్నంతనే.. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ గా పని చేసిన నాదెండ్ల మనోహర్ గుర్తుకు వస్తారు. నాదెండ్ల భాస్కరరావు అంటే.. కాస్త నోరు తెరవాల్సిందే. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళ.. అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన అలా అమెరికాకు వెళ్లగానే.. కొద్దిమంది ఎమ్మెల్యేల్ని కూడగట్టుకొని.. ఢిల్లీలోని కాంగ్రెస్ సర్కారు అండతో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. దీనిపై వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో నెల వ్యవధిలోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఉన్నట్లుండి ఈ పాత ముచ్చట్లు ఎందుకంటే.. నాటి విషయాన్ని తాజాగా ప్రస్తావించారు తమిళనాడు నేతలు. అన్నాడీఎంకేలో నెలకొన్నఅంతర్గత సంక్షోభం.. చిన్నమ్మ జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. పళనిస్వామిని అన్నాడీఎంకే శాసన సభాపక్ష నేతగా ఎన్నికైనందున.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఆయనకే ఉన్నందున ఆయనకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్ ను అభ్యర్థిస్తున్నారు చిన్నమ్మ వర్గ ఎమ్మెల్యేలు. తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చిన్నమ్మ వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు.. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న పళనిస్వామి.. పన్నీర్ సెల్వం వాదనల్ని విన్న తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు మౌనంగా ఉన్నారేకానీ పెదవి విప్పటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పళనిస్వామి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల బలం ఉన్న ఎన్టీఆర్ ను కాదని.. బలం లేని నాదెండ్లను ముఖ్యమంత్రిని చేసిన చందంగా చేయొద్దని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో పది మంది ఎమ్మెల్యేలతో గద్దెనెక్కిన నాదెండ్ల మాదిరి పన్నీర్ ను సీఎం చేయొద్దని వ్యాఖ్యానించటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/