Begin typing your search above and press return to search.
పన్నీర్ వర్సెస్ పళనీ స్వామి..ఇపుడిదే హాట్
By: Tupaki Desk | 14 Feb 2017 4:27 PM GMTఅన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తూ దేశం మొత్తం తమిళనాడు వైపు చూస్తోంది. తమిళ రాజకీయాల్లో క్లైమాక్స్ ఎలా ఉండబోతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నిన్నటివరకు పన్నీర్ VS శశికళగా ఉన్న రాజకీయాలు ఇవాళ పన్నీర్ VS పళని స్వామిగా మారాయి. సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ సుప్రీం తీర్పు అనంతరం తమిళనాడులో రాజకీయ పరిణాలు పూర్తిగా మారిపోయాయి. తీర్పు వెలువడ్డ గంటసేపట్లోనే శశికళ కీలక నీర్ణయం తీసుకున్నారు.
అన్నాడీఎంకే శాసన సభాపక్షనేతగా మంత్రి పళని స్వామిని ప్రకటించారు. దీంతో సీన్ పూర్తిగా మారిపోయింది. సుప్రీం తీర్పును ముందుగానే ఊహించి శశికళ ముందస్తు ప్రణాళిక ప్రకారమే అంతా చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడాలంటే ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సీఎంను ఎన్నుకోవడానికి చాన్సు ఇస్తారా? లేక అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధాస్తారా? లేక పన్నీర్ సెల్వంను ఇంకొన్నాళ్ల పాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. కాగా, తమిళనాడు సీఎం పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారు అనే విషయంపైనే ఇప్పడు అంతా చర్చ జరుగుతోంది.
పన్నీరు సెల్వం, పళని స్వామి ఇద్దరూ అమ్మ భక్తులే. కాకపోతే ఒకరు పెద్దమ్మ భక్తులు, ఇంకొకరు చిన్నమ్మ భక్తులు. అమ్మ జయలలిత మాటకు మారు పేరుగా ఉంటూ పన్నీరుసెల్వం ఇప్పటికే ముఖ్యమంత్రిగా బాగానే అనుభవం సంపాధించారు. అమ్మ చెప్పినట్లు నడుచుకొని అమ్మకు ఎక్కడా చెడ్డపేరు తేకుండా పన్నీరు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ మధ్య తలెత్తిన జల్లికట్టు వివాదాన్ని కూడా పన్నీరు పరిష్కరించారు. తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్న పన్నీరు సీఎం పదవిపై ధీమాగా ఉన్నారు. శశికళకు జైలు శిక్ష పడిన తరువాత నిన్నటివరకు ఆమె వెంట నడిచిన ఎమ్మెల్యేలు ఇప్పడు పన్నీరు వైపు వస్తారా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు.
ఇక పళని స్వామి గురించి మాట్లాడుకుంటే... జయలలితకు పన్నీరు ఎంతో శశికళకు పళని స్వామి అంత. ముందు నుంచీ పళని స్వామికి సీటు ఇప్పించడంలో శశికళనే కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో పళని స్వామితో పాటు దాదాపు 40 మందికి తన అనుచరులకు శశికళ సీట్లు ఇప్పించుకున్నారని, ఇప్పడు వారంతా శశికళ వెంటే ఉంటారనే సమాచారం ఉంది. నిజానికి శశికళకు శిక్ష ఖరారు కాగానే.. జయ మేనల్లుడు దీపక్, సెంగొట్టియాన్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అనూహ్య రీతిలో పళనిస్వామి పేరును శశికళ ప్రతిపాదించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/