Begin typing your search above and press return to search.

చిన్నమ్మ అప్పుడే మొదలెట్టింది

By:  Tupaki Desk   |   19 Feb 2017 4:50 AM GMT
చిన్నమ్మ అప్పుడే మొదలెట్టింది
X
కలలు కన్న సీఎం పదవి చేజారినా.. పార్టీపై చిన్నమ్మ పట్టు చేజారలేదన్న విషయం తాజాగా రుజువైంది. ప్రజా ఆగ్రహాం ఒకవైపు.. చిన్నమ్మ మరోవైపు ఉన్నప్పటికీ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చిన్నమ్మ వైపే మొగ్గారు. అమ్మ పట్ల ఎలాంటి విధేయతను ప్రదర్శించారో.. అంతే విధేయతను ప్రదర్శించారు. వారానికి పైనే గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఉంచేసినా అస్సలు ఫీల్ కాలేదు సరికదా.. క్యాంప్ లో ఉన్న 122 మంది గుండుగుత్తుగా ఓట్లేసి.. చిన్నమ్మ మాటకు తామెంత కట్టుబడి ఉంటామన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు.

బలపరీక్షలో తాను రచించిన వ్యూహం వర్క్ వుట్ అయిన నేపథ్యంలో.. తన ప్రణాళికను అమలు చేసే ప్రయత్నంలో పడ్డారు చిన్నమ్మ. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడి.. కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో ఉంటున్న చిన్నమ్మ.. త్వరలోనే చెన్నై లేదంటే వేలూరు జైలుకు తరలి వెళ్లేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

జైల్లో వసతుల లేమి.. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో.. ఆమెను సొంత రాష్ట్రానికి తీసుకురావటం ద్వారా.. జైల్ లో ఏ మాత్రం కష్టపడకుండా ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని బావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన పిటీషన్ ను సోమవారం కోర్టులో దాఖలు చేయనున్నారు. నిన్నటి వరకూ ప్రభుత్వ ఏర్పాటు ఏమవుతుందోనన్న ఉత్కంట నెలకొన్ననేపథ్యంలో.. చిన్నమ్మ జైలు షిఫ్టింగ్ మీద ఫోకస్ చేయని విధేయులు.. చేతిలోకి పవర్ వచ్చినప్పటి నుంచి చిన్నమ్మ జైలును మార్చేందుకు ప్రయత్నాలు షురూ చేశారు.

వయోభారం.. చిన్నమ్మ ఎదుర్కొంటున్నఆరోగ్య సమస్యల్నికోర్టు దృష్టికి తీసుకెళ్లటం ద్వారా తమ ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేయాలని శశికళ తరఫు న్యాయవాదులు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి కోర్టులో దాఖలు చేయాల్సిన పిటీషన్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది.

జైలు షిఫ్టింగ్ విషయంలో తమిళనాడు అధికారపక్ష నేతలు దాఖలు చేసే పిటీషన్ విషయంలో అభ్యంతరం పెట్టకూడదని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. చిన్నమ్మను కలుసుకోవటానికి.. ఆమెకు తమ విధేయతను ప్రకటించటానికి తరచూ జైలుకు వచ్చే అవకాశం ఉన్నదరిమిలా.. ఆ తలనొప్పుల్ని రోజూ పడేకంటే.. చిన్నమ్మను ఆమె రాష్ట్రానికి పంపటం ఉత్తమంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఆమె జైలు మారటం చాలా త్వరగానే పూర్తి అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/