Begin typing your search above and press return to search.

ఒకే రోజు: ప్రధానితో పళని.. ప్రణబ్ తో పన్నీర్

By:  Tupaki Desk   |   28 Feb 2017 9:23 AM GMT
ఒకే రోజు: ప్రధానితో పళని.. ప్రణబ్ తో పన్నీర్
X
అమ్మ మరణం అనంతరం.. చిన్నమ్మ సీఎం కావాలన్న ప్రయత్నాల నేపథ్యంలో మొదలైన అన్నాడీఎంకే అంతర్గత విభేదాల పంచాయితీ మరోసారి ఆసక్తికరంగా మారాయి. చిన్నమ్మ సీఎం కుర్చీలో కూర్చోవటానికి ట్రై చేయటం.. అదే సమయంలో ఆమెకు బ్రేకులు పడేలా పరిణామాలు చోటు చేసుకోవటం.. అంతలోనే పన్నీర్ గళం విప్పటంతో సంక్షోభం ముదిరిపోయింది.

దాదాపు ఎనిమిది రోజులకు పైనే సాగిన హైటెన్షన్ డ్రామా.. పళని స్వామి బలప్రదర్శనతో ఒక కొలిక్కి వచ్చింది. అయితే.. అసెంబ్లీలో జరిగిన బలప్రదర్శనలో పళని స్వామి విజయాన్ని తప్పు పడుతూ ఓపక్క విపక్ష నేత స్టాలిన్ తనవంతు ప్రయత్నాలు తాను చేస్తుంటే.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.

తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షను రద్దు చేయాలంటూ డీఎంకే కోర్టును ఆశ్రయించటం.. అందుకు స్పందించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఒకే రోజులో అన్నాడీఎంకేకు చెందిన ఇరు పక్షాల ముఖ్యనేతలు ఢిల్లీలో రాజకీయం చేయటం ఆసక్తికరంగా మారింది. ఈ రోజు.. ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అదే సమయంలో.. రాష్ట్రపతి ప్రణబ్ దాను కలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం టైం తీసుకున్నారు. తనకుమద్దుతుగా నిలిచే ఎంపీలతో పళని స్వామి మోడీని కలుస్తుంటే.. తనకు అండగా ఉన్న అన్నాడీఎంకే ఎంపీలతో రాష్ట్రపతి ప్రణబ్ ను పన్నీర్ సెల్వం భేటీ కానున్నారు. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సరిగా జరగలేదని.. దాన్ని రద్దు చేసి..రాష్ట్రపతి పాలన విధించాలని ప్రణబ్ నుకోరనుంది. ఒకే రోజున ఇరువర్గాలకు చెందిన ముఖ్యనేతలు ఢిల్లీకి చేరుకోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/