Begin typing your search above and press return to search.

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి

By:  Tupaki Desk   |   16 Feb 2017 12:50 PM GMT
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి
X
అనుకున్న సమయానికి అనుకున్నట్లే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏర్పాడు పళని స్వామి ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు. ఆయనతో పాటు 31 మంది మంత్రులు ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈరోజు(గురువారం) సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం మొదలైంది. పెద్ద హడావుడి ఏమీ లేకుండా.. పరిమిత సంఖ్యలో ఉన్న ఆహుతుల మధ్య పళనిస్వామి తన ప్రమాణస్వీకారోత్సవాన్ని పూర్తి చేశారు.

తొలుత జాతీయ గీతం.. అనంతరం తమిళ రాష్ట్ర గీతాలాపన పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా పళని స్వామిని ప్రమాణం పూర్తి అయ్యాక.. మిగిలిన మంత్రుల్ని బృందాల వారీగా ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగు రాష్ట్రాలకు భిన్నంగా ఈ తీరు కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకరి తర్వాత ఒకరుగా మంత్రులు తమ ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు. అనంతరం వారికి శాఖలు కట్టబెట్టటం చూస్తుంటాం. తాజాగా మాత్రం.. ప్రమాణస్వీకారోత్సవానికి ముందే.. ఎవరెవరికి ఏయే శాఖలన్న విషయాల్ని తెలిసేలా ప్రకటనను విడుదల చేయటం గమనార్హం. కీలకమైన శాఖలన్నింటిని తన వద్దనే పళనిస్వామి ఉంచుకోవటం విశేషం.

ఎంతో ఆశపడిన సీఎం స్థానానికి తాను ప్రమాణస్వీకారం చేయాల్సిన ఉన్నా.. చేయలేక జైలు గదికే పరిమితమైన చిన్నమ్మ వేదన చెందినా.. తాను ఎంపిక చేసిన వ్యక్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటంపై మాత్రం శశికళ సంతోష పడటం ఖాయమని చెప్పాలి.

మంత్రులు.. వారికి కేటాయించిన శాఖలు చూస్తే..

శ్రీనివాసన్ - అటవీ శాఖ

సెంగొట్టయ్యన్ - పాఠశాల విద్య.. క్రీడలు.. యువజన సంక్షేమం

కె రాజు - సహకారశాఖ

తంగమణి - విద్యుత్.. ఎక్సైజ్

వేలుమణి -గ్రామీణాభివృద్ధి.. మున్సిపల్

జయకుమార్ - మత్స్య

షణ్ముగం - న్యాయశాఖ

అన్బలగన్ - ఉన్నత విద్య

వి.సరోజ - సామాజికసంక్షేమం

సంపత్ - పరిశ్రమలు

కరుప్పనన్ - పర్యావరణం

కామరాజ్ -ఆహార.. పౌరసరఫరా

ఓఎన్ మణియన్ - చేనేత.. జౌళి

కె.రాధాకృష్ణన్ - హౌసింగ్.. పట్టణాభివృద్ధి

సి. విజయభాస్కర్ - ఆరోగ్యం.. కుటుంబ సంక్షేమం

కదంబర్ రాజు - సమాచార.. ప్రచారం

ఆర్ బీ ఉదయ్ కుమార్ - రెవెన్యూ

ఎన్. నటరాజన్ - పర్యటకం

కేసీ వీరమణి - వాణిజ్య పన్నులు

కేటీ రాజేంద్ర బాలాజీ - పాలు.. పాడిపరిశ్రమ

పీ. బెంజిమిన్ - గ్రామీణ పరిశ్రమలు

నీలోఫెన్ కాఫీల్ - కార్మిక శాఖ

ఎంఆర్ విజయభాస్కర్ - రవాణా

ఎం మణికందన్ - ఐటీ

వీఎం రాజ్యలక్ష్మి - గిరిజన సంక్షేమం

భాస్కరన్ - ఖాదీ

రామచంద్రన్ - దేవాదాయ

వలర్మతి - బీసీ సంక్షేమం

బాలకృష్ణారెడ్డి - పశుసంవర్థకం

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/