Begin typing your search above and press return to search.
మంత్రిని ఓడించి టీఆర్ ఎస్ లోకి !
By: Tupaki Desk | 14 March 2019 12:38 PM GMTపార్టీ విన్నర్లతో నిండుగా కళకళలాడుతున్నా గులాబీ దళంలో చేరడానికి ఇంకా డిమాండ్ తగ్గలేదు. మేమూ వస్తాం.. అంటూ ప్రతి ఒక్కరూ ఇతర పార్టీల నుంచి బ్యాగులు సర్దుకుంటున్నారు. టీఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రత్యేకంగా చేపట్టకుండానే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారు.
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక తండ్రి కంటే స్పీడుగా వలసలను తెప్పిస్తున్నారు. రోజు ఎవరో ఒకరు గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. టీఆర్ ఎస్ ఎత్తులకు తెలంగాణలో కాంగ్రెస్ చితికిపోతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి వలసలు భారీ ఎత్తున కనిపించాయి. తాజాగా ఓ కీలక నేత అది కూడా కేసీఆర్ పట్టుకోసం తపిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి చేరాడు. కేటీఆర్‌ను కలిసి ఓ మొక్కను బహుకరిస్తూ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అధికారికంగా త్వరలో పార్టీ కండువా కప్పుకుంటానని ప్రకటించారు.
సీఎల్పీ నేత భట్టివిక్రమార్క జిల్లా (పాత ఖమ్మం) నుంచి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారగా... ఉపేందర్ మూడో వ్యక్తి. ఇంతకుమునుపు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ - పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఉపేందర్ కూడా టీఆర్ ఎస్ లో చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కుదేలయ్యింది. పైగా కేసీఆర్ నమ్మిన నేతల్లో ఒకరైన తుమ్మల నాగేశ్వరరావును పాలేరులో ఓడించిన ఎమ్మెల్యే ఈయనే.
తుమ్మల బలమైన మంత్రిగా మార్కులు తెచ్చుకున్నారు గాని ప్రజల్లో స్ట్రాంగ్ లీడర్ గా గుర్తింపు పొందడంలో విఫలమై ఓడిపోయారు. ఆయన ఓటమి కేసీఆర్ ను కూడా షాక్‌కు గురి చేసింది. తుమ్మలపై కేవలం 1950 ఓట్ల తేడాతో గెలిచిన ఉపేందర్ తో మరి ఇక ముందు తుమ్మల ఎలా కలిసిపోతారో చూడాలి. ఓడిపోయినా కేసీఆర్‌కు అయితే తుమ్మల మీద అభిమానం తగ్గలేదు.