Begin typing your search above and press return to search.
అక్బర్ తో రిలేషన్ లేదట.. అత్యాచారాలేనట!
By: Tupaki Desk | 4 Nov 2018 5:57 AM GMTపెను దుమారంగా మారిన మీటూ ఉద్యమం పుణ్యమా అని కేంద్రమంత్రి పదవిని పోగొట్టుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎంజే అక్బర్. అప్పుడెప్పుడో ఏదో చేశారంటూ వరుస పెట్టి మరీ పలువురు మహిళలు పెద్ద ఎత్తున తెర మీదకు రావటం.. ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేయటంతో అక్బర్‌ను మోడీ సర్కార్ సాగనంపింది.
ఇదిలా ఉంటే.. అక్బర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వారిలో అమెరికాలోని నేషనల్ పబ్లిక్ రేడియో చీఫ్బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ ప్రముఖులు. తాజాగా ఆమె వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన ఒక వ్యాసంలో అక్బర్ తో తనకున్న భయానకమైన అనుభవం గురించి రాశారు. ఇది పెను దుమారంగా మారింది.
ఈ ఆర్టికల్ పై అక్బర్ తో పాటు.. ఆయన సతీమణి సైతం స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పల్లవితో తనకు వివాహేతర సంబంధం ఉందని.. కొంతకాలం పాటు సాగిందే తప్పించి.. లైంగిక వేధింపులు ఎంత మాత్రం కాదన్న మాటను అక్బర్ చెప్పారు. తన భర్తతో పల్లవికి వివాహేతర సంబంధం ఉందన్న సందేశాన్ని అక్బర్ సతీమణి సైతం వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఈ అంశంపై పల్లవి తాజాగా మరోసారి రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆమె.. అక్బర్ చెప్పినట్లుగా 1994లో కొన్ని నెలల పాటు ఆయనతో వివాహేతర సంబంధం ఉందన్న వాదనలో వాస్తవం లేదన్నారు. తామిద్దరం కొంతకాలం కలిసి ఉందన్నది కూడా నిజం కాదన్నారు. అక్బర్ వాదనల్ని పూర్తిగా తోసి పుచ్చిన ఆమె.. అదో భయానకమైన పరిస్థితిగా అభివర్ణించారు.
అక్బర్ చేతిలో లైంగిక దాడులకు గురైన మహిళలు ముందుకు వచ్చి నిజాల్ని బయటపెట్టాలన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. అక్బర్ చేతుల్లో లైంగిక దాడులకు గురైన 16 మంది మహిళలు ఇప్పటివరకూ బయటకు వచ్చారు. పల్లవి తాజా ట్వీట్ తో మరెంత మంది బయటకు వస్తారో చూడాలి.