Begin typing your search above and press return to search.
జగన్ సీఎం కాకుండా మునుల శాపం
By: Tupaki Desk | 16 Sep 2015 10:37 AM GMTఏపీ అధికారపక్షానికి.. విపక్షానికి మధ్య మాటల యుద్ధం మహారంజుగా సాగుతోంది. ఏపీ సర్కారు తీరుపై ఏపీ విపక్షనేత వైఎస్సార్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడటం.. దానికి బదులుగా అన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోవటం మామూలైంది.
తాను వెళ్లే ప్రతిచోట మరికొద్దిరోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు దిగిపోతారని.. తానే తర్వాత ముఖ్యమంత్రి అని వైఎస్ జగన్ చెప్పుకోవటం తెలిసిందే. దీనికి కౌంటర్ గా తమ్ముళ్లు చాలానే సటైర్లు వేసినా.. తాజాగా ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చేస్తున్న విమర్శలు మాత్రం అందరిని ఆకర్షిస్తున్నాయి. తానే తర్వాత సీఎం అని జగన్ చెప్పుకుంటారని.. కానీ అది సాధ్యం కాదని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే.. జగన్ కు మునుల శాపం ఉందని చెబుతున్నారు.
మంచి పనులు చేస్తూ.. ఏపీ సంక్షేమం కోసం పాటుపడుతున్న చంద్రబాబును జగన్ రాక్షసుల మాదిరి అడ్డుకుంటున్నారని.. ఎప్పటికీ జగన్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదని పల్లె చెబుతున్నారు. మొత్తానికి ఏపీ అధికార.. విపక్షాల మధ్య మాటల యుద్దంలో ఇప్పటికే సైకో లాంటి మాటలే కాదు..తాజాగా మునులు.. రాక్షసులు లాంటివి వచ్చాయి. రానున్న రోజుల్లో మరెంత మందిని సీన్లోకి తీసుకొస్తారో..?