Begin typing your search above and press return to search.
పల్లెకు మళ్లీ పదవి..
By: Tupaki Desk | 11 Nov 2017 7:22 AM GMTవిభజన తరువాత ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలికేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనంతపురం జిల్లా నేత పల్లె రఘునాథరెడ్డికి మళ్లీ పదవి దొరికింది. సీనియర్ నేత అయినప్పటికీ మంత్రి పదవి నుంచి ఆయన్ను చంద్రబాబు తప్పించారు.. లోలోన అసంతృప్తి ఉన్నా పల్లె... చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవించి మిన్నకున్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పల్లెకు మరోసారి పదవి ఇచ్చారు. అసెంబ్లీలో చీఫ్ విప్ గా ఆయన్ను నియమించారు. సోమవారం లోగా చీఫ్ విప్ ను ఖరారు చేయాల్సిన నేపథ్యంలో చంద్రబాబు ఆయన్ను నియమించారు. అలాగే మండలిలో చీఫ్ విప్ గా పయ్యావుల కేశవ్ ను నియమించారు.
శాసన సభ చీఫ్ విప్ గా ఉన్న కాల్వ శ్రీనివాసులును మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో ఆ పదవిని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఈ పదవికి మాజీమంత్రి పల్లె రఘు నాథరెడ్డి, సీనియర్ శాసనసభ్యుడు కాగిత వెంక ట్రావు - విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పోటీ పడ్డారు.
మంత్రి పదవి నుంచి తనను తప్పిస్తున్న సమయంలో చీఫ్‌విప్ పదవిని తనకు ఇస్తానని సీఎం చంద్రబాబు అప్పుడే హామీనిచ్చారని పల్లె రఘునాథరెడ్డి ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని ఆశించానని అయితే మంత్రికి సమానమైన పదవిని కట్టబెడతానని అప్పట్లో సీఎం తనకు భరోసా ఇచ్చారని కృష్ణా జిల్లాకు కాగిత వెంకట్రావు కూడా చెప్పేవారు. మంత్రిమండలితో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆశించిన బోండా ఉమామహేశ్వరరావు ఈ దఫానైనా తనకు చీఫ్‌విప్ పదవిని ఇవ్వాలని చంద్రబాబు, లోకేశ్ ల చుట్టూ తిరిగారు. అయినా.. చంద్రబాబు చివరకి పల్లెకే అవకాశమిచ్చారు.
మరోవైపు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కు కూడా పదవి దక్కింది. శాసన మండలి చీఫ్ విప్ గా ఆయనకు అవకాశమిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే కాలేకపోయిన ఆయనకు కొద్దికాలం కిందటే ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు మండలిలో చీఫ్ విప్ ను చేశారు.