Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రులు జీవించేస్తున్నారు
By: Tupaki Desk | 23 Jan 2016 9:33 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నటించమంటే జీవించేస్తున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని ఎలుకలు కరిచి చంపేసినప్పుడు.. ఆ తరువాత అక్కడ అనేక సమస్యలు బయటపడినప్పుడు పరిష్కరించలేకపోయిన ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తాజాగా గుంటూరు ఆసుపత్రిపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ముందుకొచ్చారు. తన మోకాలి కీలుకు శస్త్రచికిత్స అవసరం కాగా గుంటూరు ఆసుపత్రిలో ఆ ఆపరేషన్ చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. గుంటూరు హాస్పిటల్ లో ఎలుకలను కంట్రోల్ చేయడం నా తరం కాదన్న మంత్రే ఇప్పుడు అక్కడ స్వయంగా ఆపరేషన్ చేయించుకుని ప్రజల్లో నమ్మాకాన్ని పెంచే ప్రయత్నం చేయడంతో ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. అసలే చంద్రబాబు మంత్రివర్గంలో బెంచ్ మీద ఉన్నారని అనుకుంటున్న కామినేని ఈ చర్యతో మళ్లీ కేబినెట్ లో తన బెర్తు సుస్థిరం చేసుకునే అవకాశం ఉందని... ఆయన కూడా అందుకే ఇలాంటి ఎత్తుగడ వేశారని అంటున్నారు.
కాగా కామినేని ప్లాను బాగుందని అనుకున్నారో ఏమో కానీ మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా తానూ వీలైనంత వరకు అలాంటి ప్లాను వర్కవుట్ చేసేందుకు ట్రై చేశారు. ఆయన కూడా చంద్రబాబు కేబినెట్ లో బెంచ్ పైనే ఉన్నారని అనుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన కూడా చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేందుకు కామినేని ప్లానునే అమలు చేశారు... అయితే... ఆయనకు ఆపరేషన్ అవసరం లేకపోవడంతో కేవలం బీపీ చెక్ చేయించుకుని ఫొటోలు తీయించుకున్నారు. గుంటూరు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న సహచర మంత్రి కామినేనిని పరామర్శించేందుకు శనివారం అక్కడికి వచ్చిన పల్లె రఘునాథరెడ్డి ఆ పని పూర్తయిన తరువాత నేరుగా ఓపీ విభాగానికి వెళ్లారు. అక్కడ చీటీ రాయించుకుని ప్రజలతో పాటే వరుసలో నిలబడి వెళ్లి ఓపీలో ఉన్న వైద్యుడిని కలిసి బీపీ చెక్ చేయించుకున్నారు. మంత్రిగారు స్వయంగా వెళ్లి ఓపీలో నిల్చుని బీపీ చెక్ చేయించుకోవడంతో అక్కడున్న వారంతా ఔరా అనుకున్నారు. అయితే... టీడీపీలో కొందరు నేతలు మాత్రం గుంటూరు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే మంత్రి పదవులకు ఢోకా ఉండదన్న సెంటిమెంటు ఏదో ఉందని .. అందుకే ఇలా మంత్రులంతా గుంటూరు ఆసుపత్రికి వస్తున్నారని అంటున్నారు.