Begin typing your search above and press return to search.
ఆ టీడీపీ మంత్రులు మళ్లీ పేచీ పెట్టుకున్నారు
By: Tupaki Desk | 25 Dec 2015 3:52 PM GMTక్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశంలో విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. చోటా మోటా లీడర్లు కాకుండా ఏకంగా మంత్రుల స్థాయిలో ఉన్న నాయకులు రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సింది పోయి బహిరంగంగా కామెంట్లు చేసుకుంటున్నారు. అది కూడా పవిత్ర పండగ దినం సందర్భంగా కావడం గమనార్హం.
తాజాగా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అనంతపురం జిల్లా టీడీపీ మంత్రులు పరిటాల సునీత - పల్లె రఘునాథరెడ్డిల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తెల్ల రేషన్ కార్డులున్న క్రైస్తవ కుటుంబాలకు అందిస్తున్న చంద్రన్న కానుకల సంచీపై తన చిత్రాన్ని ముద్రించకపోవడం వెనుక పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత హస్తముందని పల్లె ఆరోపించారు. తాను ఐటీ - మైనార్టీల మంత్రి హోదాలో ఉన్నానని, జిల్లాకు చెందిన వాడినే అయినప్పటికీ తన చిత్రాన్ని ముద్రించలేదని పల్లె ఆక్షేపించారు. అయితే వేదికపై చేసిన ఈ కామెంట్లకు సునిత స్పందించలేదు. కానీ సభ ముగిసిన అనంతరం అక్కడే ఉన్న పార్టీ నేతలతో మాట్లాడుతూ పల్లె విమర్శలు పట్టించుకునే అవసరం లేదని సునీత వ్యాఖ్యానించడం గమనార్హం.
పరిటాల సునీత నిత్యమూ ప్రొటోకాల్ పాటించడం లేదని ఆగ్రహంతో ఉన్న మంత్రి పల్లె త్వరలో ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. కాగా వీరిద్దరి మధ్యా విభేదాలు తలెత్తడం ఇదే తొలిసారి కాదు. గతంలో రంజాన్ కానుకలను రంజాన్ తోఫా పేరుతో ఇచ్చినప్పుడు సైతం బ్యాగులపై మైనార్టీ మంత్రి అయిన పల్లె చిత్రం లేదు. మరోమారు ఇలా జరుగకుండా చూసుకుంటామని అప్పట్లో పౌరసరఫరాల శాఖా అధికారులు ఆయనకు సర్ది చెప్పారు. తాజాగా మరోమారు ఈ వివాదం తెరమీదకు రావడం పట్ల తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు.