Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్ :.. పల్లె రఘునాథ రెడ్డి పరిస్థితి ఏమిటి?

By:  Tupaki Desk   |   21 March 2019 5:17 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్ :.. పల్లె రఘునాథ రెడ్డి పరిస్థితి ఏమిటి?
X
-2009లో ఏర్పడిన నియోజకవర్గం పుట్టపర్తి. ఈ నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా పల్లె రఘునాథరెడ్డి ఇక్కడకు వలస వచ్చారు. అయితే ఈయనకు ఇప్పటికీ పుట్టపర్తితో అనుబంధం ఏమీ ఏర్పడలేదు.

-ఇప్పటికీ రఘునాథరెడ్డి ఓటు కదిరి నియోజకవర్గం పరిధిలో - కదిరి టౌన్ లో ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

-నియోజకవర్గంలో కమ్మ వాళ్ల జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. దానికి తోడు బీసీల మద్దతుతో పల్లె విజయం సాధిస్తూ వస్తున్నారు.

-మంత్రి అయ్యాకా మాత్రం పల్లె నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు. పేరుకు ఐటీ తో పాటు అరడజను శాఖలకు మంత్రిగా వ్యవహరించినా.. అన్ని సౌకర్యాలు ఉన్న పుట్టపర్తికి సమీపంలో అయినా ఏ చిన్న పరిశ్రమను కూడా తీసుకురాలేకపోవడం పల్లె చేతగాని తనం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

-పుట్టపర్తికి విమానాశ్రయం సైతం ఉంది - బెంగళూరుకు సమీపంలో ఉంటుంది. నీటి కొరత కూడా ఏమీ పెద్దగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రఘునాథరెడ్డి ఒక్క చిన్న పరిశ్రమను అయినా తీసుకురాలేకపోయాడంటే..ఆయన చేతగాని తనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానిక యువత అభిప్రాయపడుతోంది.

-ఇక ఇప్పుడు కూడా పల్లె రఘునాథ రెడ్డి పెద్ద యాక్టివ్ గా లేరు. నియోజకవర్గంలో పర్యటనలు లేవు. ఆయన పిల్లలు మాత్రం తమ తల్లి పేరు చెబుతూ ఏదో సెంటిమెంట్ రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

-ఎన్నికల ముందు చీరలు పంచుతున్నారు. ఐదేళ్లు అధికారం ఇస్తే - మంత్రి పదవిలో మూడేళ్లు ఉండి.. చివరకు జనాలను అడుక్కుతినేవాళ్లను చేసి వంద రూపాయల చీరలు పంచుతూ ఓట్లు అడుక్కోవడం పల్లె రఘునాథరెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి పరాకాష్ట అనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తూ ఉంది.

-ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి శ్రీధర్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలుగా గట్టిగా పని చేస్తున్నారు. గత ఎన్నికలు అయ్యాకా ఆరు నెలల్లోనే ఈ నియోజకవర్గం ఇన్ చార్జిగా వచ్చి పని మొదలుపెట్టారాయన.

-అధికారంలోకి వస్తే.. పుట్టపర్తి సెగ్మెంట్ లో ఉన్న ప్రతి ఊరు చెరువుకూ నీళ్ల ను అందించేందుకు కృషి చేస్తానంటూ శ్రీధర్ రెడ్డి సాగుతూ ఉన్నారు. రఘునాథ రెడ్డి అసమర్థత శ్రీధర్ రెడ్డికి వరంగా మారే అవకాశం ఉంది.

-తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల పాటు పని చేసిన వారు కూడా ఇప్పుడు రఘునాథరెడ్డిపై తీవ్రమైన అసహనంతో ఉన్నారు.

-ఈ నియోజకవర్గంలో జనసేన ప్రభావం స్వల్పంగా ఉండబోతోంది. అది తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుకు గండిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

-అయితే పల్లె దగ్గర లెక్కలేనంత డబ్బు ఉందని - ఇప్పుడు కూడా ప్రచారానికి రాకుండా డబ్బులు తీసుకెళ్లాలని ఆయన ద్వితీయ శ్రేణి నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారని.. డబ్బుతో ఫలితాలను మార్చేయవచ్చనే లెక్కతో ఆయన ఉన్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

విజయావకాశాలుః

-బీసీ ఓటు బ్యాంకు - ప్రభుత్వ వ్యతిరేక ఓటు - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రెడిషినల్ ఓటు.. శ్రీధర్ రెడ్డికి అనుకూలత.

-తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు రఘునాథ రెడ్డికి అనుకూలత.

-రఘునాథ రెడ్డి ఓటమి ఖాయమనే మాట నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తూ ఉంది. శ్రీధర్ రెడ్డికి ఛాన్స్ ఖాయమని అంటున్నారు.

-విజయావకాశాలు శ్రీధర్ రెడ్డి వైపు 55 శాతం ఉంటే - రఘునాథ రెడ్డి వైపు 45 శాతం ఉన్నాయని మా క్షేత్ర స్థాయి సర్వే లో తేలింది.