Begin typing your search above and press return to search.

వైఎస్ విగ్ర‌హం సాక్షిగా.. వేడెక్కిన ప‌ల్నాడు.. !!

By:  Tupaki Desk   |   1 Sep 2022 5:08 AM GMT
వైఎస్ విగ్ర‌హం సాక్షిగా.. వేడెక్కిన ప‌ల్నాడు.. !!
X
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో విగ్రహ రాజకీయాలు వేడెక్కాయి. పల్నాడు సెంటర్‌లో వైఎస్ విగ్రహాన్ని వైసీపీ నేతలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించిన భూమి పూజ‌లు కూడా జ‌రిగిపోయాయి. అయితే టీడీపీ నేతలు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఈమేరకు అనుమతి లేని విగ్రహం ఏర్పాటును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల జారీ చేసినప్పటికీ వైఎస్ విగ్రహ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

దీంతో అధికార పార్టీ నాయ‌కుల‌ను అడ్డుకోలేక‌.. అధికారులు ఇబ్బంది ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో కోర్టు ఆదేశాలను అమ‌లు చేయ‌క‌పోతే.. మ‌రిన్ని చిక్కులు ఎదుర్కొన‌క త‌ప్ప‌ద‌ని కూడా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

దీంతో కోర్టు దిక్కారణ పిటీషన్ దాఖలు చేసేందుకు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో టీడీపీ సిద్ధమవుతోంది. మ‌రోవైపు.. నియోజ‌క‌వ‌ర్గంలో ఈ విగ్ర‌హం రాజ‌కీయాలు కొన్నాళ్లుగా ఊపందుకున్నాయి.

సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డికి వ్య‌తిరేకంగా.. ఇక్క‌డ టీడీపీ నాయ‌కులు ధ‌ర్నా చేశారు. అయితే.. దీనిని రాజ‌కీయం చేస్తున్నార‌ని.. గ‌తంలో ఎన్టీఆర్‌విగ్ర‌హం పెట్టిన‌ప్పుడు..వైసీపీ నేత‌లుగా తాము ఏమైనా ఎదురు నిలిచామా? అని గోపిరెడ్డి అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ నాయ‌కులు మాత్రం.. ఎ ప్ప‌టి క‌ప్పుడు.. వైఎస్ విగ్ర‌హ ఏర్పాటు అంశాన్ని చాలా నిశితంగా గ‌మ‌నిస్తున్నారు.

దీనిని ఏర్పాటు చేయ‌డం ద్వారా.. వైసీపీ మ‌రింత‌గా పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని వారు భావిస్తున్నారు. కానీ, ఎన్టీఆర్ విగ్ర‌హాలు ఉన్న‌ప్పుడు.. మేం మాత్రం ఎందుకు ఏర్పాటుచేయ‌కూడ‌దు అనే ధోర‌ణిలో.. వైసీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మరి ఈ ప‌రిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.