Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యే 20 ఏళ్లొచ్చినా పాలే తాగేవారట..
By: Tupaki Desk | 28 Feb 2017 11:48 AM GMTతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విదూషకులుగా మారుతున్నారు. ఆ మధ్య వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసి మంత్రి పదవికి గురిపెట్టిన జలీల్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి చెప్పి కామెడీ చేసిన సంగతి తెలిసిందే. తాను బీకాంలో ఫిజిక్సు చదువుకున్నానని చెప్పిన ఆయన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా షేర్ అవుతూనే ఉంది.
తాజాగా టీడీపీకే చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే కూడా అలాంటిదే విచిత్రమైన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ఆయన చెప్పిన మాటలు నిజమో.. అబద్ధమో.. అతిశయోక్తో అర్థం కాక మొదటి నుంచి ఆయన గురించి తెలిసిన నేతలే తల పట్టకుంటున్నారట. నిజమో, అబద్ధమో పక్కనపెడితే ఆయన మాటలు మాత్రం సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.
భీమవరం టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు రీసెంటుగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను 20ఏళ్ల వయసు వచ్చే వరకు అన్నం తినలేదని చెప్పారు. 20 ఏళ్ల వయసు వరకు కేవలం పాలు తాగి బతికానని.. అన్నం అంటే ఎలా ఉంటుందో తెలియదని చెప్పి షాక్ ఇచ్చారు. 20 ఏళ్ల తర్వాత కూడా బలవంతంగా అన్నం తినాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. 20ఏళ్ల వయసు వచ్చినా అన్నం తినకపోతే పిల్లనిచ్చేందుకు వెనుకాడుతారన్న ఉద్దేశంతోనే అన్నం తినాల్సి వచ్చిందన్నారు. దీంతో ఆయన నిజం చెబుతున్నారా అవాస్తవా అన్నది తెలియకపోయినా సెటైర్లయితే భారీగా పడుతున్నాయి. టీడీపీలో భిన్నమైన వ్యక్తులున్నారని.. ఒకరు బీకాంలో ఫిజిక్సు చదివితే.. ఇంకొకరు పాతికేళ్లొచ్చినా పాలు తాగుతున్నారని అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/