Begin typing your search above and press return to search.
చిన్నపిల్లాడి మాదిరి ఈ మాటలేంది పాల్వాయ్
By: Tupaki Desk | 13 Jun 2016 9:22 AM GMTసీనియార్టీ పెరిగే కొద్దీ వీలైనంత పెద్దరికంగా వ్యవహరించాలి.కానీ.. అందుకు భిన్నంగా చిన్నపిల్లాడిగా మాట్లాడటం ఏ మాత్రం సూట్ కాకపోవటమే కాదు.. చూసేందుకు సైతం చిల్లరగా అనిపించటం ఖాయం. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన పాల్వాయ్ గోవర్దనరెడ్డినే తీసుకుంటే.. ఆయన వెనుకా ముందు చూసుకోవటంలో పెద్ద ట్రాక్ రికార్డే ఉంది. ఆయన తీరును గర్హిస్తూ.. ఇటీవలే ఆయనకు షోకాజ్ నోటీను జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆయన్ను గాంధీ భవన్ కు రావాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తున్న జానారెడ్డిని ఉద్దేశించి చేసిన తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలపై మండిపడిన పార్టీ.. ఆయన్ను వివరణ ఇవ్వాలంటూ ఆదేశిచారు. ఇలా చేతికి నోటీసులు అందగానే.. అంతే వేగంగా సమాధానం ఇవ్వటం మానేసిన పాల్వాయ్.. చిన్నపిల్లాడి మాదిరి లేవనెత్తుతున్న అంశాలు పార్టీలోని పలువురికి చికాకు పుట్టిస్తున్నాయి.
తెలంగాణకాంగ్రెస్ సారథి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన పాల్వాయ్.. తనపై ఆరోపణలు చేసిన పార్టీ నేతలు షబ్బీర్ అలీ.. మల్లురవిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వారిద్దరూ గతంలో బాధ్యతారాహత్యంతో వ్యాఖ్యలుచేశారని.. వారి మాటలన్నీ క్రమశిక్షణారాహిత్యం అవుతుందంటూ లెక్కలు చెబుతున్న ఆయన.. తాను చేసిన తప్పుల్ని ఒప్పుకొని లెంపకాయలు వేసుకోకుండా.. ఎదుటోళ్ల మీద ఆరోపణల్ని చేయటం గమనార్హం. మరి.. పాల్వాయ్ మాటలకు పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.