Begin typing your search above and press return to search.

భూమి మీద అత్యంత మూర్ఖుడు ఎవరంటే..?

By:  Tupaki Desk   |   11 April 2015 6:45 AM GMT
భూమి మీద అత్యంత మూర్ఖుడు ఎవరంటే..?
X
తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య లల్లి రోజురోజుకి ముదురుతుందే తప్పించి తగ్గటం లేదు. మిగిలిన రాజకీయ పక్షాలకు.. కాంగ్రెస్‌కు ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ అధికారంలో లేనప్పుడు కొద్దిపాటి అసంతృప్తితో రగిలిపోతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉంటారు.కానీ.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.

అధికారంలో ఉన్నా.. లేకున్నా వారు నిత్యం కీచులాడుతూనే ఉంటారు. ఎన్ని మార్పులు చేర్పులు చేసినా.. అసంతృప్తి మాత్ర రావణకాష్ఠంలా కాలుతూనే ఉంటుంది తప్ప సంతృప్తి ఉండదు.

వైఎస్‌ లాంటి మహానేతకే తప్పని అసంతృప్తి సెగ.. ఇప్పుడున్న నేతలకు ఉండదా? ఈ మధ్యన కాంగ్రెస్‌ అధినాయకత్వం కలుగజేసుకొని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి పలు మార్పులు.. చేర్పులు చేయటం తెలిసిందే. పీసీసీ చీఫ్‌గా పొన్నాలను తీసేసి.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమించటం తెలిసిందే. అయితే..లోకల్‌ రాజకీయాలు.. సమీకరణల పుణ్యమా అని నల్గండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉత్తమ్‌కి అంతగా పొసగదు. వీరిద్దరి మధ్య వార్‌ అందరికి తెలిసిన వ్యవహారమే.

ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ ఎంపికను కోమటిరెడ్డి విమర్శించటం.. ఉత్తమ్‌కు వత్తాసుగా సీనియర్‌ నేత.. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ భూమి మీద ఉన్న అత్యంత మూర్ఖుడు కోమటిరెడ్డి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించటం భేష్‌ అంటూ పొగిడేశారు. తిట్లు.. పొగడ్తల మాటేమో కానీ.. పార్టీ పరువు మాత్రం బజార్లోకి తీసుకొచ్చి నాశనం చేస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మాత్రం మండి పడుతున్నారు. ఈ అంతర్గత గొడవలు ఎప్పటికి సర్దుబాటు అయ్యేను.. ఎప్పటికి కుదురుకొని అందరూ ఏకతాటి మీదకు వచ్చి తెలంగాణ అధికారపక్షంపై పోరాడటమూ అంటూ నిట్టూర్పులు వదులుతున్నారు. చూస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలది అత్యాశలా ఉంది కదూ.