Begin typing your search above and press return to search.
ఆ విజయాలన్నీ ట్యాంపరింగ్ తోనేనంట
By: Tupaki Desk | 15 Feb 2016 4:37 PM GMTతెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఎన్నికల్లో అయినా తెలంగాణ అధికారపక్షం బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. పరిశీలకుల ఊహాలకు అందని రీతిలో వచ్చి పడుతున్న విజయాల క్రెడిట్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతాలోకి వేస్తున్నారు. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి మాత్రం టీఆర్ ఎస్ భారీ విజయాలకు తనదైన శైలిలో కొత్త భాష్యం చెబుతున్నారు.
ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లోనే కాదు.. త్వరలో జరిగే ఖమ్మం.. వరంగల్ కార్పొరేషన్లను కూడా టీఆర్ ఎస్ కైవసం చేసుకోవటం ఖాయమని పాల్వాయి వ్యాఖ్యానించటం విశేషం. విపక్షంలో ఉండి.. అధికారపక్షం గెలుస్తుందని అలా ఎలా చెబుతున్నారని పాల్వాయిని నిందిచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తెలంగాణ అధికారపక్షం విజయానికి పాల్వాయి చెబుతున్న లాజిక్ ఏమిటంటే.. ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే టీఆర్ ఎస్ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ఆరోపించారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం మొత్తం ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే చోటు చేసుకుందని పాల్వాయి వాదిస్తున్నారు. భారీ అవకతవకలకు పాల్పడుతున్న టీఆర్ ఎస్ రానున్న వరంగల్.. ఖమ్మం ఎన్నికల్లో కూడా విజయం పక్కా అని తేల్చేయటం గమనార్హం.