Begin typing your search above and press return to search.

కోడిపెట్టకు డైపర్.. కాసులు కురిపించింది..

By:  Tupaki Desk   |   21 Aug 2018 1:30 AM GMT
కోడిపెట్టకు డైపర్.. కాసులు కురిపించింది..
X
ఏదైనా సమస్య నుంచే దాని పరిష్కారం వస్తుందంటారు.. ఆ సమస్యలోంచే మనకు కొత్త ఆవిష్కరణ పుడుతుంది. దాన్ని తయారు చేస్తూ మానవుడు తన సౌకర్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఇలా చక్రం నుంచి మొదలైన మన ప్రస్థానం ఇప్పుడు అంతరిక్షంలోకి రోవర్లను పంపేదాకా ఎదిగింది.. అమెరికాలోని న్యూహాంప్ షైర్ కు చెందిన జూలీ బేకర్ అనే మహిళకు వచ్చిన ఐడియా ఇప్పుడు ఆమెను లక్షాధికారిని చేసింది. అంతేకాదు.. ఆమె బాధలను తీర్చింది.

జూలీ బేకర్ కూతురు ఓ కోడిని తీసుకొచ్చి ఇంటిలో పెంచుకుంటోంది. ఆ కోడిపెట్టె ఎక్కడ పడితే అక్కడ రెట్టలు వేయడం చేసేది. దీంతో ఇల్లు అంత కోడిపెంట వాసన కొట్టేది. దీంతో దాన్ని శుభ్రపరుచుకోవడానికి జూలీ బేకర్ కు తలకుమించిన భారం అయ్యేది. అప్పుడు వచ్చిన ఐడియా ఆమె జీవితాన్నే మార్చేసింది.

ఎక్కడో యూట్యూబ్ లో చూసిన వీడియోతో జూలీ ఆ కోడిపెట్టకు డైపర్ కుట్టేసింది. చిన్నపిల్లలు మూత్రం పోయకుండా వాడే డైపర్లను కోడికి అనుగుణంగా కుట్టేసింది. కొన్నేళ్ల క్రితం దీన్ని విస్తరించింది. ‘పేంపర్డ్ పౌల్ట్రీ’ పేరిట ఆన్ లైన్ లో విక్రయాలు కూడా మొదలుపెట్టింది. నెమ్మది నెమ్మదిగా విక్రయాలు పెరిగాయి. అన్ని ఖర్చులు పోను ఇప్పుడు జూలికి రూ.40 లక్షల దాకా మిగులుతున్నాయట.. ఇలా తన డైపర్ల ఐడియా వ్యాపారంగా విస్తరించి ఇప్పుడామెకు కాసులు కురిపిస్తున్నాయట.. ఐన్ ఐడియా కన్ చేంజ్ యువర్ లైఫ్ అంటే ఇదేనేమో..