Begin typing your search above and press return to search.
క్రెడిట్ కార్డు ఉంటుంది..పాన్ కార్డు మాత్రం ఉండదు
By: Tupaki Desk | 21 March 2016 3:57 AM GMT రేషన్ కార్డులు - ఆధార్ కార్డులు - ఏటీఎం కార్డులు - క్రెడిట్ కార్డులు... ఇలా అంతా కార్డులమయంగా మారిపోయింది. అయితే... ఇప్పటికే కొన్ని కార్డుల విషయంలో మాత్రం ఇండియాలో పెద్దగా అభివృద్ధి కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజనతో దేశంలో దాదాపుగా అందరికీ బ్యాంకు ఖాతాలు ఏటీఎం లేదా డెబిట్ కార్డులు వచ్చేశాయి. దీంతో ఆధార్ కార్డులు - బ్యాంకుల డెబిట్ కార్డులు దాదాపుగా అందరి వద్దా ఉంటున్నాయి. కానీ.... ఆదాయ - ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పాన్ కార్డు మాత్రం చాలామంది తీసుకోవడం లేదట. పాన్ కార్డు వరకు ఎందుకు అసలు దేశంలో పన్ను కట్టేవారి సంఖ్యే తక్కువట. కేవలం 3 శాతం ఇండియన్లు మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారట. ఇక పాన్ కార్డుల విషయానికొస్తే ఒకట్రెండు రాష్ర్టాలు తప్పితే మిగతా రాష్ట్రాలన్నిటిలోనూ పరిస్థితులు ఘోరంగానే ఉన్నాయి. ఇండియాలో ప్రతి వెయ్యిమంది జనాభాకు కేవలం 203 పాన్ కార్డులే ఉన్నాయట. అత్యధికంగా ఢిల్లీలో వెయ్యి మందికి 664 మందికి పాన్ కార్డులున్నాయట. మిజోరాం - బీహార్ - ఉత్తర ప్రదేశ్ లు ఈ విషయంలో బాగా వెనుకబడిఉన్నాయి. 2016 మార్చి 15 నాటికి దేశంలో 24.56 కోట్ల మందికే పాన్ కార్డులున్నాయి. ఇందులో 50 శాతం కేవలం అయిదు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. మహారాష్ట్ర - యూపీ - పశ్చిమబెంగాల్ - ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు రాష్ట్రాల్లో దేశంలోని కార్డుల్లో 50 శాతం ఉన్నాయి.
పాన్ నంబర్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) ఆదాయపు పన్నుకు సంబంధించింది. నగదు లావాదేవీల సమయంలోనూ పరిమితిని బట్టి ఆ సంఖ్యను వేస్తుండాలి. దాని ఆధారంగానే మన లావాదేవీలన్నీ ఒక్క పద్దు కిందకు వచ్చి ఆదాయపన్ను శాఖకు అంచనాలు దొరుకుతాయి. పన్ను ఎగవేతదారులను అరికట్టడానికి దీన్ని ప్రవేశపెట్టారు. అయితే... భారతీయులు మాత్రం పన్ను కట్టకపోవడమే కాదు పాన్ కార్డూ తీసుకోవడం లేదట.
ఢిల్లీలో ప్రతి వెయ్యి మందికి 664 మందికి పాన్ కార్డులు ఉండగా.. చండీగఢ్ ఆ తరువాత స్థానంలో ఉంది. అక్కడ వెయ్యికి 644 మందికి కార్డులున్నాయి. గోవా - మహారాష్ర్ట రాష్ర్టాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
పాన్ కార్డులో టాప్ వీరే..(ప్రతి వెయ్యి మందికి లెక్క)
1. ఢిల్లీ(664),
2. ఛండీగఢ్(644)
3. గోవా- 523
4. మహారాష్ట్ర- 380
5. హర్యాణా- 281
6. గుజరాత్- 272
ఏఏ రాష్ట్రాల్లో తక్కువ(ప్రతి వెయ్యి మందికి)
- దేశంలోనే అతి తక్కువ సంఖ్యలో ప్రతి వెయ్యి మందికి కేవలం 18 మందికే పాన్ కార్డులు ఉన్న రాష్ట్రం మిజోరాం
- ఆ తరువాత స్థానంలో బీహార్ ఉంది. అక్కడ వెయ్యికి 96 మందికి పాన్ కార్డులున్నాయి.
- మణిపూర్ 1000 ; 120
- ఉత్తర ప్రదేశ్ 1000; 121
- ఛత్తీస్ గఢ్ 1000; 122
- నాగాలాండ్ 1000 ; 122
- జార్ఖండ్ 1000 ; 127
- మిజోరాం లో మొత్తం కార్డుల సంఖ్య లక్ష కంటే తక్కువే.
- ఎనిమిది రాష్టాల్లో కార్డుల సంఖ్య పది లక్షల కంటే తక్కువే.
-- గరుడ