Begin typing your search above and press return to search.
మోడీపై బాంబు పేల్చిన పనబాక
By: Tupaki Desk | 7 April 2021 1:30 PM GMTతిరుపతి ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మోడీపై విమర్శలకు వెనుకాడుతున్న వేళ ఈమె మాత్రం తాజాగా మోడీని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రత్యర్థి పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. గట్టిగా ఆరోపణలను చేసుకుంటున్నాయి. ఇప్పుడు టిడిపి నామినీ పనాబాక లక్ష్మి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా తొలిసారి స్వరం వినిపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఏపీ ప్రజలకు మోడీ అన్యాయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలకు ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని.. ఇప్పుడు మరో మోసం చేస్తోందని ఆరోపించారు. వైయస్ఆర్సిపితో సహా కేంద్రంలోని బీజేపీకి అమ్ముడుపోయిందని విమర్శలు గుప్పించింది.
ప్రధానమంత్రి మోడీ పార్టీని గెలిపిస్తే దేశంలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న అన్ని రకాల రిజర్వేషన్లను కూడా తొలగిస్తారని.. ఇందులో ఆశ్చర్యపోనవసరం లేదని పనబాక లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ రిజర్వేషన్లను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఉద్యోగాలు - పోటీ పరీక్షలలో అణగారిన వర్గాలకు అందించారని.. వాటిని మోడీ తొలగించబోతున్నారని ఆరోపించారు. ఇది బలహీన వర్గాలకు మేలు చేసేలా బీసీలను పైకిలేపేలా మోడీ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అన్ని ప్రభుత్వ రంగ యూనిట్లను అమ్ముతున్న బిజెపి ఎవరికీ రిజర్వేషన్లు ఉండవని ఈ నిర్ణయాల ద్వారా చాటిచెబుతోందని అర్థమవుతోందన్నారు.
తిరుపతిలో బీజేపీ ఇప్పుడు బలంగా లేదు. ప్రధానంగా పోటీ వైసిపి, టిడిపి మధ్య ఉంది. అయితే ఇప్పటికీ పనబాక లక్ష్మి బీజేపీనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీని ఎలాగూ ఎదుర్కోలేమని.. టీడీపీకి ప్రత్యామ్మాయంగా ఎదుగుతున్న బిజెపి ఉనికి గురించి టిడిపి ఆందోళన చెందుతోందని.. అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ టీడీపీ స్వల్ప మెజారిటీతో ఓడితే దానికి బిజెపి కారణం కావచ్చని అంటున్నారు. బిజెపి ఓట్లు చీలుస్తుందని.. టిడిపికి అది నష్టం చేస్తుందని అంటున్నారు. బీజేపీ చీల్చే ఓట్లతో వైయస్ఆర్సిపి.. కాంగ్రెస్ కు ఎటువంటి నష్టం లేదని చెబుతున్నారు. అందుకే ప్రచారంలో యాంటీ బీజేపీ స్ట్రాటజీని టీడీపీ అవలంభిస్తోందని అంటున్నారు.