Begin typing your search above and press return to search.

ఆ టీడీపీ మ‌హిళా నేత‌కు బెంగ ప‌ట్టుకుందా..ఐర‌న్‌ లెగ్ ముద్రా?

By:  Tupaki Desk   |   18 March 2021 3:30 PM GMT
ఆ టీడీపీ మ‌హిళా నేత‌కు బెంగ ప‌ట్టుకుందా..ఐర‌న్‌ లెగ్ ముద్రా?
X
తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి వ‌చ్చే నెల 17న జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక.. ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డ అనేక రూపాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కే కాకుండా.. నాయ‌కులకు కూడా పెద్ద సంక‌టంగా మారింది. ఇత‌ర పార్టీల ప‌రిస్థితిని ప‌క్క‌న పెడితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఇక్క‌డ పెను స‌వాలుగా మారింది. స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ తీవ్ర‌స్థాయిలో చ‌తికిల ప‌డిన నేప‌థ్యంలో ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఏమేర‌కు ప్ర‌భావం చూపుతుంది ? ఏమేర‌కు పుంజుకుంటుంది? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి.

అయితే.. టీడీపీ క‌న్నా ముఖ్యంగా ఇక్క‌డ ఆ పార్టీ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగుతున్న ప‌న‌బాక ల‌క్ష్మికి ఇప్పుడు మ‌రింత స‌వాలుగా మారింది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. అయితే.. 2 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గం మొహం చూడ‌లేద‌నే అప‌ప్ర‌ద‌ను ఎదుర్కొ న్నారు. నిజానికి ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. ప్ర‌జ‌ల‌కుచేరువ కావ‌డం అనేది నాయ‌కుల‌కు అత్యంత అవ‌స‌రం. అప్పుడే వారి ఓటు బ్యాంకు ప‌దిలంగా ఉంటుంది. కానీ... ప‌న‌బాక మాత్రం మ‌ళ్లీ ఐదేళ్ల‌కు క‌దా.. ఎన్నిక‌లు.. అప్పుడు చూసుకుందాం.. అనుకున్నారు. ఫ‌లితంగా ఇటు నియోజ‌క‌వ‌ర్గానికి, అటు పార్టీకి కూడా ఆమె దూర‌మ‌య్యారు.

కానీ, అనూహ్యంగా రెండేళ్ల‌లోనే ఇక్క‌డ ఉప పోరు రావ‌డం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తిరిగి ప‌న‌బాక‌కే ఇక్క‌డ సీటు కేటాయించ‌డం చిత్రంగా మారిపోయింది. ఈ విష‌యంలో ఆదిలో ప‌న‌బాక ఆనందించారు. అయితే.. ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నించిన త‌ర్వాత‌.. మాత్రం ఆమెలో ఆందోళ‌న మొద‌లైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. స్థానిక ఫ‌లితాలు చూశాక ఎవ‌రికి వారు ప‌రారైపోతున్నారు. ఇప్పుడు త‌మ్ముళ్లు స‌హ‌క‌రిస్తారో లేదో.. అనే బెంగ ఒక‌వైపు.. పార్టీకి స్థానికంలో ఎదురైన ప‌రాభ‌వం మ‌రోవైపు.. ప‌న‌బాకను వెంటాడుతున్నాయ‌ని అంటున్నారు.

అదే స‌మ‌యంలో ఇన్నాళ్లుగా తాను.. పార్టీకి దూరంగా ఉండ‌డం, నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం కూడా ఆమెకు మైన‌స్‌గా మారిపోయింది. ఆమె గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఓడిపోతూ వ‌స్తున్నారు. ఇప్పుడైనా ఇక్క‌డ గెలిచి తీర‌క‌పోతే.. త‌న‌పై ఐర‌న్ లెగ్ అనే ముద్ర ప‌డుతుంద‌నే భ‌యం కూడా వెంటాడుతోంది. ఇక ఆమె రాజ‌కీయ జీవితానికి ఫుల్ స్టాప్ కూడా ప‌డ‌నుంది. ఇన్ని ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌న‌బాక ఏవిధంగా దూసుకువెళ్తారో చూడాలి. ఇక‌, ఇక్క‌డ ప్ర‌ధానంగా టీడీపీకి గెల‌వ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. ప‌న‌బాక‌కు అంత‌కు మించిన అవ‌స‌రంగా మారిందన్న‌ది వాస్త‌వం.