Begin typing your search above and press return to search.
బిగ్-బి మళ్లీ ఇరుక్కున్నారు
By: Tupaki Desk | 21 Jun 2018 9:43 AM GMTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన్ని కొన్నేళ్లుగా వెంటాడుతున్న పనామా పేపర్ల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత లా కంపెనీ మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన మరికొన్ని పరిశోధనాత్మక పత్రాలు బయటకు వచ్చాయి. ఇందులో అమితాబ్ సహా పలువురు భారతీయ ప్రముఖుల పేర్లున్నాయి.
దాదాపు 12 లక్షలకు పైగా సరికొత్త పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) అధ్యాయనం చేసిందంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. వీటిలో దాదాపు 12 వేల పత్రాలు భారతీయులకు సంబంధించినవి కావడం గమనార్హం. 2016లో దాదాపు 500 మంది భారతీయుల పేర్లు మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన పత్రాల్లో ఉన్నాయి. వీటిపై విచారణ జరిపేందుకు భారత ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎమ్ ఏజీ)ను ఏర్పాటు చేసింది. 2016 లీక్‌ల ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఎమ్ ఏజీ గుర్తించింది. పనామా పేపర్లలో తమ పేర్లు రావడాన్ని ఖండించిన కొందరు ప్రముఖుల పేర్లు మళ్లీ బయటకు వచ్చాయి. ఈ జాబితాలో అమితాబ్ తో పాటు శివ్ విక్రమ్ ఖేమ్కా.. మాజీ సొలిసిటర్ జనరల్ సొరాబ్జీ తనయుడు జహంగీర్ సొరాబ్జీ.. డీఎల్ ఎఫ్ గ్రూప్ కు చెందిన కేపీ సింగ్ - ఆయన కుటుంబ సభ్యులు.. అనురాగ్ కేజ్రీవాల్.. మెహ్రాసన్స్ జ్యువెల్లర్స్‌కు చెందిన నవీన్ మెహ్రా.. అండర్ వరల్డ్ డాన్ ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ మెమన్ ల పేర్లు ఉన్నాయి.
వీరు కాక 2016 లీక్స్ లో లేని కొన్ని కొత్త పేర్లు కూడా బయటికి వచ్చాయి. ఆ జాబితాలో పీవీఆర్ సినిమా యజమాని అజయ్ బిజ్లీ - ఆయన కుటుంబ సభ్యులు.. సునీల్ మిట్టల్ కుమారుడు - హైక్ మెసేంజర్ సీఈవో - భారతీ ఎయిర్ టెల్ సీఈవో కవిన్ భారతి మిట్టల్.. ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ అశ్విన్ దాని కుమారుడు జలాజ్ అశ్విన్ దానిల పేర్లున్నాయి. వీరికి ఆఫ్ షోర్ కంపెనీలతో బిజినెస్ లింక్స్ ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలను ఐసీఐజే జర్నలిస్టులు సంపాదించారు.