Begin typing your search above and press return to search.

తెలంగాణలో రాజకీయ వేడి.. తగ్గట్లేదు..

By:  Tupaki Desk   |   27 Dec 2018 5:17 AM GMT
తెలంగాణలో రాజకీయ వేడి.. తగ్గట్లేదు..
X
తెలంగాణలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గకుండా టీఆర్ ఎస్ అధినేత - కేసీఆర్ చూసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘనవిజయం సాధించాక అదే ఊపును కొనసాగించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే పంచాయతీ ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు కేసీఆర్ సర్కారు ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ పల్లెల్లో పరిస్థితి వేడెక్కింది. పంచాయతీ ఎన్నికలను వచ్చే 20 రోజుల్లోపే నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుండడంతో చోటా మోటా నేతలు సమాయత్తమవుతున్నారు. సర్పంచ్ పదవి అంటే గ్రామాల్లో చిన్నదేం కాదు.. ఇక్కడి నుంచి నేతల ప్రస్తానం మొదలై ఎమ్మెల్యే - మంత్రి వరకు సాగుతుంది. భవిష్యత్ రాజకీయాలకు సర్పంచ్ పదవే ప్రామాణికం తొలిమెట్టు కావడంతో అందరూ ఈ పదవి కోసం పోటీపడుతారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంటుంది.

తెలంగాణలో టీఆర్ ఎస్ గద్దెనెక్కడంతో ఆ పార్టీ హవానే పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రస్ఫూటిస్తుంటుంది. పార్టీల గుర్తులు పంచాయతీ ఎన్నికల్లో వాడకున్నా కానీ ఆ పార్టీల నేతల మధ్యే పోరు ఉంటుంది. ఇక ఒక పార్టీ వారే గ్రూపులుగా విడిపోయి తమ పంచాయతీ మీద ఆదిపత్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎమ్మెల్యేలు కూడా తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు తమ అనుయాయులను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ పంచాయతీ ఎన్నికలను ఈసారి మూడు విడతల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. ఈ మేరకు లోక్ సభ షెడ్యూల్ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే చాన్స్ ఉంది.

ఇక ఏపీలో మాత్రం చంద్రబాబు ఎన్నికలకు భయపడుతున్నారు. హైకోర్టు నిర్వహించాలని చెప్పినా.. అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్వహిస్తే తేడావస్తే ప్రజాగ్రహం పెల్లుబుకుతుందని గ్రహించి మిన్నకుండిపోతున్నారు. దీంతో వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారు.