Begin typing your search above and press return to search.

త‌మ్మినేని కుటుంబంలో `పంచాయ‌తీ`- సొంత వ‌దిన‌కే సెగ పెట్టారుగా!

By:  Tupaki Desk   |   17 Feb 2021 2:30 AM GMT
త‌మ్మినేని కుటుంబంలో  `పంచాయ‌తీ`- సొంత వ‌దిన‌కే సెగ పెట్టారుగా!
X
ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ తమ్మినేని సీతారాం కుటుంబంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు సెగ పెట్టాయి. త‌మ్మినేని సొంత అన్నదివంగ‌త‌ త‌మ్మినేని శ్యామ‌ల‌రావు కుటుంబానికి సీతారాం కుటుంబం రాజ‌కీయ షాకులు ఇచ్చింద‌ని స్థానికంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. స్థానిక ఎన్నికల్లో సీతారాం సొంత నియోజ‌క‌వ‌ర్గం ఆముదాల వ‌ల‌స ప‌రిధిలోని తొగ‌రాం పంచాయ‌తీ స‌ర్పంచ్ ప‌ద‌వికి తమ్మినేని సీతారాం స‌తీమ‌ణి.. త‌మ్మినేని వాణి నామినేష‌న్ వేశారు. ఆమెకు వైసీపీ సంపూర్ణ మద్ద‌తు ల‌భించింది. దీంతో ఎవ‌రూ రంగంలోకి దిగ‌ర‌ని అంచ‌నా వేసుకున్నారు.

చిన్నా చిత‌కా ఎవ‌రైనా ఉంటే మేనేజ్ చేసుకోవ‌చ్చ‌ని భావించారు. అయితే.. అనూహ్యంగా త‌మ్మినేని సొంత అన్న‌.. దివంగ‌త త‌మ్మినేని శ్యామ‌ల‌రావు స‌తీమ‌ణి.. భార‌త‌మ్మ‌.. బ‌రిలో నిలిచారు. దీంతో సీతారాం కుటుంబం నిప్పులు చెరుగుతోంది. ఏక‌గ్రీవం అవుతుంద‌ని భావించిన పంచాయ‌తీలో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డాన్ని.. తీవ్రంగా భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే సీతారాం.. కుటుంబం వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపింది. అన్నకుమారుడిని ఆ కుటుంబానికి దూరం చేయ‌డంతోపాటు.. బ‌రిలో నిలిచిన‌.. భార‌తమ్మ త‌ర‌ఫున ఎవ‌రూ ప్ర‌చారం చేయకుండా నిలువ‌రించింది!.

దీంతో త‌మ్మినేని భార‌తమ్మ ఒంట‌ర‌య్యారు. ఒక‌వైపు.. త‌మ్మినేని వాణి.. భారీ ఎత్తున మందీ మార్బ‌లంతో ప్ర‌చారం చేస్తుండ‌గా.. భార‌తమ్మ మాత్రం.. ఒక్క‌త్తే ప్ర‌చారం చేసుకుంటున్నారు. మ‌రోవైపు ఆమె కుమారు డు.. త‌ల్లికి దూరంగా ఉంటూ.. నామినేష‌న్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని త‌ల్లిపై ఒత్తిడి తెస్తున్నారు!. సొంత అన్న కుటుంబానికి అండ‌గా నిలిచి.. అవ‌స‌ర‌మైతే.. త‌ల్లిలాంటి వ‌దిన‌నే పంచాయ‌తీ స‌ర్పంచ్ చేసేందుకు ప్ర‌య‌త్నించాల్సిన సీతారాం.. ఇలా.. ఓ ప‌ద‌వి కోసం.. సొంత అన్న కుటుంబంతోనే పొలిటిక‌ల్ గేమ్ ఆడ‌తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

వ‌ద‌న‌-మ‌ర‌ద‌ళ్లు ప్ర‌చారంలో ఎదురు ప‌డినా.. ప‌ల‌క‌రించుకోవ‌డం లేదు. అంతేకాదు.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు కూడా చేసుకుంటున్నారు. ఇలా.. త‌మ్మినేని కుటుంబంలో పంచాయ‌తీ పోరు.. కొత్త వివాదాల‌కు దారితీసింది. ఒక వేళ‌.. సీతారాం వ‌దిన ‌.. భార‌త‌మ్మ సెంటిమెంటుకు ప్ర‌జ‌లు మొగ్గు చూపితే.. సీతారాం ప‌రువు పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.