Begin typing your search above and press return to search.
రూల్స్ కేం.. మస్తు ఉంటాయ్ అంటే ఇదే మరి!
By: Tupaki Desk | 23 Dec 2018 4:55 AM GMTపుస్తకాల్లో ఉండే రూల్స్‌కు..జరిగే వాటికి ఏ మాత్రం సంబంధం ఉండదనటానికి ఇదో చక్కటి ఉదాహరణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. పంచాయితీ ఎన్నికలు జరుగుతాయో లేదో అన్న సందేహం ఒక పక్క ఉండగా.. మరోవైపు పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన రూల్స్ తెర మీదకు వచ్చాయి.
ఈ నిబంధనలు ఏమీ కొత్తవి కాకున్నా.. సామాన్యుడు సైతం అడిగినా అభ్యర్థులు రోజువారీ ఖర్చుల లెక్క చెప్పాలన్న మాటను ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా చెబుతున్నారు. మిగిలిన రూల్స్ సంగతి మామూలే అయినా.. ఎవరికైనా లెక్క చెప్పాలన్న రూల్ తో పోటీ చేసే అభ్యర్థులకు చుక్కలు కనిపించటం ఖాయమన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
మిగిలిన ఎన్నికల మాదిరే.. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏదైనా జాతీయ బ్యాంకుల్లో ప్రత్యేకంగా అకౌంట్‌ను తెరవాల్సి ఉంటుంది. తమ ప్రచారానికి సంబంధించిన వివరాల్ని ఏ రోజుకు ఆ రోజు అధికారులకు తెలపాల్సి ఉంటుంది. ఇక.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాల్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంపీడీవోలకు ఎన్నికల కమిషన్ అప్పజెప్పింది.
మిగిలిన రూల్స్ ఎలా ఉన్నా.. పోటీ చేసే అభ్యర్థులు..తమ ఎన్నికల ఖర్చుల వివరాల్ని గ్రామాల్లోని ఓటర్లు మొదలు సామాన్య ప్రజానీకంతో పాటు.. మీడియా ప్రతినిధులు ఎవరు అడిగినా ఉచితంగా అందించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరాలు తెలియటంతో పాటు ఎన్నికల ఖర్చుకు కళ్లాలు వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
సామాన్యుల సంగతి ఎలా ఉన్నా.. అభ్యర్థుల తరఫు వారు తమ ప్రత్యర్థి అభ్యర్థుల వారికి ఖర్చు లెక్కల పేరుతో చుక్కలు చూపించటం ఖాయమని చెప్పక తప్పదు. ఎన్నికల ఖర్చు వివరాల్ని చెప్పే విషయాన్ని లైట్ తీసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం షాక్ తప్పదని చెబుతున్నారు. ఖర్చుల వివరాల్ని సమర్పించని అభ్యర్థులకు కొన్నేళ్ల పాటు ఎన్నికల బరిలో నిలుచునే అవకాశం ఉందని చెబుతున్నారు. రూల్స్ కేం మస్తుగా ఉంటాయి.. వాటి ఆచరణకు ఏ మాత్రం సూట్ కాదన్న వాదనకు పంచాయితీ ఎన్నికల ఖర్చు మాట గురించి చెప్పాల్సిందే.
గతంలో ఖర్చుల లెక్కలు చెప్పని 12 వేల మందిపై ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై అనర్హత వేటు వేసినట్లుగా తెలుస్తోంది. ఇక.. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి రూల్స్ చెప్పే లెక్కను చూస్తే..
+ 5 వేలకు పైనే జనాభా ఉన్న పంచాయితీ సర్పంచ్ అభ్యర్థులకు ఖర్చు పరిమితి రూ.2.5లక్షలు
+ 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయితీల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.1.5లక్షలు
+ 5 వేలకు పైనే జనాభా ఉన్న పంచాయితీల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసే వారి ఖర్చు రూ.50వేలకు దాటకూడదు
+ 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయితీల్లో పోటీ చేసే వార్డు సభ్యుడి ఎన్నికల ఖర్చు రూ.30వేలకు మించకూడదు.