Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : ఏపీలో మోగిన ఎన్నికల నగారా

By:  Tupaki Desk   |   4 March 2020 4:08 AM GMT
బ్రేకింగ్ : ఏపీలో మోగిన ఎన్నికల నగారా
X
ఏపీలో ఎండలతో పాటు ఎన్నికల వేడి కూడా రాజుకుంటోంది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడింది. ఈ మార్చి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మార్చి లోనే ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు సైతం పంపించింది. మార్చి 7న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 21న వీటి ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇక పట్టణాల్లోనూ ఎన్నికల సందడి ఒకేసారి రాబోతోంది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చి 24న ఎన్నికలు నిర్వహిస్తారు.

ఇక గ్రామాల్లో మార్చి 15న పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరిస్తారు. మార్చి 27న ఎన్నికలు నిర్వహిస్తారు.

మొత్తంగా ఈసారి నోటిఫికేషన్ వచ్చిన 14 రోజుల్లోనే ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. డబ్బు, మద్యం ప్రవాహం లేకుండా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా అధికార వైసీపీకే మెజార్టీ స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అమరావతి సహా మూడు రాజధానులు, జగన్ నిర్ణయాల నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఫలితాలపై అధికార వైసీపీవైపు జనాలు నిలుస్తారా? ప్రతిపక్ష చంద్రబాబు పార్టీకి మద్దతిస్తారా.? గ్రామాలు, పట్టణాల ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.