Begin typing your search above and press return to search.
సరిగ్గా ఏడాది తర్వాత.. ఏపీలో హాట్ హాట్ పాలిటిక్స్!
By: Tupaki Desk | 10 March 2020 2:30 PM GMTసరిగ్గా గత ఏడాది మార్చి పదో తేదీన లోక్ సభ, ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆ రోజుతో దేశ వ్యాప్తంగా రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఏపీలో డబుల్ హాట్ అయ్యాయి. నెల రోజుల వ్యవధి తర్వాత పోలింగ్ ను ప్రకటిస్తూ ఏపీకి సంబంధించి అసెంబ్లీ, అలాగే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అప్పటికే రాజకీయ వేడి ఉన్నా, ఆ తర్వాత మరింత పెరిగింది.
విశేషం ఏమిటంటే.. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరింది. రాజీనామాలు, చేరికలు, నామినేషన్లతో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. పల్లెలు, పురాలు ఓటు వేయడానికి రెడీ అవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో తమ లక్ ను పరీక్షించుకోవడానికి రాజకీయ నేతలు రెడీ అవుతున్నాయి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు విపరీతంగా నేతలు పార్టీలు మారడం, అటూ ఇటూ చేరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మంచి ఊపు మీద కనిపించడం తో.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అప్పటి తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. జగన్ కు జై కొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీటు దక్కని వారిలో అతి కొద్ది మంది మాత్రమే తెలుగుదేశం బాట పట్టారు. అయితే వారిది రాంగ్ మూవ్ అయ్యింది.
ఇక అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్లు, ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నించి అప్పుడు చేరలేకపోయిన వాళ్లు.. ఇప్పుడు జగన్ కు జై కొడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి కొందరు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యం లో చేరికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఉంది.
ఏడాది కిందట తన పార్టీ కండువాలను నేతలకు కప్పడంలో బిజీగా కనిపించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు కూడా అంతే బిజీగా కనిపిస్తూ ఉండటం గమనార్హం.