Begin typing your search above and press return to search.
పంచాయతీ పోరుపై ఏపీ - ఒడిశాల మధ్య వివాదం
By: Tupaki Desk | 21 Feb 2021 6:24 AM GMTఏపీ-ఒడిషా సరిహద్దుల్లోని 34 కొఠియా గ్రామాలు ఏ రాష్ట్రానివి అనేవి వివాదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అవి మా గ్రామాలేనని పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. దానిపై ఒడిషా ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టుకు ఎక్కింది.
తాజాగా ఏపీ-ఒడిషా సరిహద్దుల్లోని కొఠియా గ్రామాల ప్రజలు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని ఓటేశారు. ఈ నేపథ్యంలో ఓట్లేసిన ఆ గ్రామాల ప్రజలకు అధికారుల నుంచి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ‘మీకు ఆంధ్రా కావాలా? ఒడిశా కావాలా? జగన్ మోహన్ రెడ్డి కావాలా.. నవీన్ పట్నాయక్ కావాలా’? అని తమను ప్రశ్నిస్తున్నారని ఎన్నికల్లో ఓట్లేసిన గ్రామస్థులు వవాపోతున్నారు.
విజయనగరం జిల్లా సాలూరు మండలం కోనదారుకు చెందిన కొందరు ఉపాధి హామీ డబ్బుల కోసం పొట్టంగి బ్యాంకుకు వెళ్లగా అధికారుల నుంచి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏపీ ఎన్నికల్లో ఎందుకు ఓట్లేశారని అధికారులు తమను ప్రశ్నించారని పలువురు పేర్కొన్నారు. మీకు డబ్బులివ్వమని మొండికేశారని అన్నారు. వివాదాస్పద గ్రామాల్లోని వారికి డబ్బులు ఇవ్వమంటున్నారని ఓ మహిళ వాపోయంది.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడంపై కొందరు ఒడిషా అధికారులు వచ్చి నిలదీశారని గ్రామస్థులు తెలిపారు. ఇక సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్ దాఖలు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ 34 గ్రామాల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని.. అవి అరకు, సాలూరు నియోజకవర్గాల పరిధిలోని ఏపీ గ్రామాలేనని సుప్రీంకోర్టుకు తెలిపింది.