Begin typing your search above and press return to search.

కోట సాక్షిగా బయటపడ్డ పూసపాటి వంశీయుల కొట్లాట!

By:  Tupaki Desk   |   28 Oct 2020 1:30 PM GMT
కోట సాక్షిగా బయటపడ్డ పూసపాటి వంశీయుల కొట్లాట!
X
విజయనగర ఒకప్పటి రాజులు.. అదే జిల్లాకు చెందిన చెంది పూసపాటి వంశీయుల మధ్య మరో సారి విభేదాలు బయటపడ్డాయి. అనాధిగా వస్తున్న ఆచారాల విషయంలో ఆ వంశీయుల మధ్య వైరాలు వెలుగుచూశాయి.

తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన పైడితల్లి సిరిమానోత్సవంలో పూసపాటి వంశీయుల పంచాయితీ హాట్ టాపిక్ గా మారింది. కోట బురుజుపై కూర్చోవడానికి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అయిన సంచయిత పేచీ పెట్టడం తాజా వివాదానికి కారణమైంది.

ఈ ఉత్సవానికి ముందుగా వచ్చిన ఆనందగజపతిరాజు భార్య సుధ, కుమార్తె ఉర్మిళ కోటపై కూర్చున్నారు. అయితే అప్పుడే వచ్చిన సంచయిత వారిద్దరినీ చూసి ఆగ్రహం చెందారు. వారిని కోట నుంచి దింపాలంటూ పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే పోలీసులు సుధ, ఉర్మిళను కోట నుంచి కిందికి వెళ్లమని చెప్పలేమంటూ సంచయితకు స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే సంచయిత కోటకు మరోవైపు కుర్చీ వేసుకొని కూర్చొని ఈ ఉత్సవాన్ని తిలకించారు. సంచయిత తీరుకు నిరసనగా ఆనందగజపతిరాజు రెండో భార్య సుధ, ఉర్మిళ దీక్షకు దిగారు. తామే ఆనందగజపతిరాజుకు నిజమైన వారసులమని వారు భీష్మించుకు కూర్చున్నారు.

పూసపాటి వంశంలో ఆనందగజపతిరాజు మొదటి భార్య కూతురుగా సంచయితకు సర్వాధికారాలు దక్కాయి. అయితే రెండో భార్య సుధ, ఆమె కూతురు ఉర్మిళలు తమకూ హక్కులు కావాలంటూ పంచాయితీ పెడుతున్నారు. దీంతో ఈ వివాదం ప్రతీసారి రాజుకుంటూనే ఉంటుంది. ఈ ఫ్యామిలీ పంచాయితీ తెగడం లేదు.