Begin typing your search above and press return to search.
లేటెస్ట్ అప్డేట్ : దేశంలో 24 గంటల్లో 38310 కేసులు , 490 మరణాలు !
By: Tupaki Desk | 3 Nov 2020 4:15 AM GMTదేశంలో పండుగల సీజన్ మొదలుకాబోతున్న తరుణంలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది మంచి శుభపరిణామమే అయినప్పటికీ , కొన్ని దేశాల్లో ఇప్పటికే సెకండ్ వేవ్ మొదలైంది. దీనితో ఇండియాను కూడా చాలా దేశాల నిపుణులు, డబ్యుహెచ్ ఓ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మళ్లీ మొదలైయ్యే అవకాశం ఉంది. ఇండియాలో కరోనా కేసులు మరింత భారీగా తగ్గాయి. నిన్న దేశంలో 38310 కొత్త కేసులు మాత్రమే వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 82,67,623కి చేరింది. అలాగే... నిన్న కొత్తగా 490 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,23,097కి చేరింది.
దేశంలో నిన్న కొత్తగా 58323 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 76,03,121కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,41,405కి చేరాయి. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 92 శాతానికి చేరింది. ఇండియాలో నిన్న 10,46,247 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 11,17,89,350కి చేరింది. మంచి పరిణామం ఏంటంటే నిన్న ఢిల్లీలో అదనపు యాక్టివ్ కేసులు రాలేదు. హర్యానాలో మాత్రం 285 పెరిగాయి. గత 8 రోజుల్లో ఇండియాలో రెండోసారి కరోనా కేసులు 40వేల కంటే తక్కువగా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రికవరీ రేటు 72 శాతం ఉంటే ఇండియాలో అది 92 శాతం ఉంది. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ 5వేలకు మించి కొత్త కేసులు లేవు. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్ లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా, ఫ్రాన్స్ తర్వాత ఇండియా, ఇటలీ, స్విట్జర్లాండ్... టాప్ 5లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5 శాతం ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.5 శాతం ఉంది.
ఇక ,తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,536 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,421 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,42,506 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,23,413 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,351 కి చేరింది. ప్రస్తుతం 17,742 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 14,915 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా ఏపీలో 1,916 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,27,882కి చేరింది. ఇక, రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,719కి చేరింది.