Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: కోటి దాటిన మహమ్మారి కేసులు

By:  Tupaki Desk   |   28 Jun 2020 6:00 AM GMT
బ్రేకింగ్: కోటి దాటిన మహమ్మారి కేసులు
X
చైనాలోని వూహాన్ లో పుట్టి ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఈరోజుకి కోటి దాటింది. చైనా నుంచి గల్ఫ్, యూరప్ దేశాలకు అమెరికాకు సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇప్పుడు ప్రబలింది. భారత్ లోనూ కేసులు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. వైరస్ విస్తరించి 6 నెలల్లో 213 దేశాలకు పాకింది. ఈ ఆరు నెలల్లో కోటి కేసులు.. దాదాపు 5 లక్షలమంది మృతులకు చేరింది. కోటికి కేసులు చేరడంతో అంతటా అల్లకల్లోలం మొదలైంది.

2019 డిసెంబర్ 31న సార్స్ తరహాలో చైనాలోని వూహాన్ లో వైరస్ బయటపడింది. మామూలు వైరస్ అనుకున్నారు. కానీ వైరస్ వేగంగా విస్తరించి చైనా అంతటా వ్యాపించడం.. ఇతర దేశాలకు పాకి యూరప్, అమెరికాలను పట్టుకుంది.

శనివారం రాత్రికి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,00,418లకు చేరింది. మరణాల సంఖ్య 4,98,952కి చేరింది.

అమెరికాలోనే కరోనా కేసులు 25 లక్షలకు పైగా నమోదయ్యాయి. ఇప్పటిదాకా అమెరికాలో 25వేల మంది మరణించారు. రోజుకు సగటున 40వేల మందికి కరోనా సోకుతోంది. ఆ తర్వాత దీని తీవ్రత బ్రెజిల్, రష్యా, భారత్, ఇరాన్, మెక్సికో, చిలీ, పెరూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాల్లో బాగా తీవ్రత ఉంది. న్యూజిలాండ్ సహా 15దేశాలు కరోనాను జయించాయి. డబ్ల్యూహెచ్.వో ప్రకారం 80శాతం మందికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా నయమైంది. ఇతర వ్యాధులున్న వారే చనిపోతున్నారు. 5శాతం మందికి డేంజర్ గా ఉంటోంది.