Begin typing your search above and press return to search.
ఏపీలో తగ్గుతున్న కరోనా జోరు ..కొత్తగా ఎన్నంటే ?
By: Tupaki Desk | 7 Oct 2020 5:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు తగ్గిపోవడం ఊరట కలిగిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల కంటే తక్కువగా ఉంది. ఇక, బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 66,769 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 5,120 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,34,427కు చేరుకున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 34 కరోనా మరణాలు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 5 - అనంతపురం 4 - చిత్తూరు 4 - కృష్ణా 4 - విశాఖ 4 - గుంటూరు 4 - నెల్లూరు 3 - కడప 2 - కర్నూలు 2 - పశ్చిమ గోదావరి 2 ప్రకాశం జిల్లాలో ఒకరు మృత్యువాతపడ్డారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6086కు చేరింది.
బుధవారం 6,349 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,34,427 పాజిటివ్ కేసులకు గాను, 6,78,828 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 49,513 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏపీలో కొత్తగా 66769 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 6283009కు చేరుకుంది.