Begin typing your search above and press return to search.

ఏపీలో అదే ఉధృతి.. కొత్తగా 9024 కేసులు

By:  Tupaki Desk   |   11 Aug 2020 2:30 PM GMT
ఏపీలో అదే ఉధృతి.. కొత్తగా 9024 కేసులు
X
ఏపీలో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరిగింది. నిన్న 7వేల వరకు నమోదైన కేసులు మళ్లీ 9వేలు దాటాయి.. ఏపీలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు కూడా పెరుగుతున్నాయి.

రోజుకు 10వేల కేసుల వరకు ఏపీలో నమోదు అవుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా 9వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో చూస్తే.. తాజాగా కొత్తగా 9024 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 24 గంటల్లో 58315 టెస్టులు చేశారు. ఇందులో 9024 పాజిటివ్ గా తేలాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,44,549కు చేరాయి.

కరోనా నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 154749గా ఉంది. గడిచిన ఒక్కరోజులో 9113మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 87597 యాక్టివ్ కేసులున్నాయి.

తాజాగా కరోనాతో గడిచిన 24 గంటల్లో 87మంది మరణించారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 2203కు చేరింది.

తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1372 కేసులు, కర్నూలులో 1138 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాలో ప్రతీరోజు వెయ్యికి తక్కువ కాకుండా కేసులు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాకు కేంద్రాలుగా ఈ రెండు జిల్లాలు మారుతున్నాయి. ఇక అనంతపురం జిల్లాలో అత్యధికంగా 13మంది మరణించారు.