Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్తగా మరో 8,601 కరోనా కేసులు

By:  Tupaki Desk   |   24 Aug 2020 2:30 PM GMT
ఏపీలో కొత్తగా మరో 8,601  కరోనా కేసులు
X
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,601 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,712కి చేరింది. కరోనాను జయించి వీరిలో 2,68,828 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 89,516 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే కొత్తగా మరో 86 మంది మరణించారు. నెల్లూరులో 10 మంది, ప్రకాశంలో 10 మంది - తూర్పు గోదావరిలో 9 మంది - గుంటూరులో 9 మంది - చిత్తూరులో 8 మంది, - కడపలో 8 మంది - శ్రీకాకుళంలో ఏడుగురు - విశాఖపట్టణంలో ఏడుగురు - అనంతపూర్‌ లో ఆరుగురు - కృష్ణాలో ఐదుగురు - విజయనగరంలో నలుగురు - కర్నూలులో ఇద్దరు - పశ్చిమ గోదావరిలో ఒకరు చనిపోయారు.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,368 మంది మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ఒక్క జిల్లాలోనే ఇప్పటి వరకు 50,686 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 54,463 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 32,92,501మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 1441 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు 965, చిత్తూరు 495, ప్రకాశం 589, కర్నూలు 484, పశ్చిమగోదావరి 466, గుంటూరు 467, అనంతపురం 933, విశాఖపట్నం 911, కడప 639, శ్రీకాకుళం 485, విజయనగరం 572, కృష్ణా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.