Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా జోరుకి బ్రేకుల్లేవ్ .. కొత్తగా మరో 8835 కేసులు

By:  Tupaki Desk   |   16 Sep 2020 3:00 PM GMT
ఏపీలో కరోనా జోరుకి బ్రేకుల్లేవ్ .. కొత్తగా మరో 8835 కేసులు
X
ఏపీలో కరోనా జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకి పాజిటివ్ నమోదు అయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8835 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 592760కు చేరింది. అలాగే , రాష్ట్రంలో కరోనా కారణంగా కొత్తగా 64 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, నెల్లూరు 7, గుంటూరు 6, ప్రకాశం 6, అనంతపురం 5, కడప 5, కృష్ణ 5, శ్రీకాకుళం 5, పశ్చిమ గోదావరి 5, కర్నూలు 4, తూర్పు గోదావరి 3, విశాఖ 2, విజయనగరం జిల్లాలో ఇద్దరు చనిపోయారు.

అలాగే , తాజాగా గత 24 గంటల్లో 10,845 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,97,376కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 48,06,879 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 75,013 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 8,835 మందికి పాజిటివ్‌గా తేలింది. కొత్తగా 64మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 5,105కి చేరింది. ప్రస్తుతం 90,279 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే .. తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా 1421 కేసులు, పశ్చిమ గోదావరిలో 1051, ప్రకాశం 873, చిత్తూరు 798, అనంతపురం 725, గుంటూరు 685, నెల్లూరు 562, విజయనగరం 544, కడప 536, శ్రీకాకుళం 495, కర్నూలు 424, కృష్ణా 396, విశాఖ జిల్లాలో 325 కేసులు నమోదయ్యాయి.