Begin typing your search above and press return to search.

ఏపీలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు..ఆ రెండు జిల్లాల్లో కొనసాగుతున్న విధ్వంసం!

By:  Tupaki Desk   |   18 Sep 2020 2:11 PM GMT
ఏపీలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు..ఆ రెండు జిల్లాల్లో కొనసాగుతున్న విధ్వంసం!
X
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల్లో తాజాగా మరో 8,096 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో నమోదైన కేసుల సంఖ్య 6,09,558కి చేరుకుంది. 24 గంటల్లో 74,710 మందికి టెస్టులు నిర్వహించారు. మరోవైపు ఇదే సమయంలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,244కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 84,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,19,891 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ప్రస్తుతం 84,423 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ 60కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి.

ఇక , గడిచిన 24 గంటల్లో కడప జిల్లాలో 8 మంది, చిత్తూరులో ఏడుగురు, కృష్ణాలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు మృత్యువాత పడ్డారు. బుధవారం 11,803 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం పరిస్థితి మాత్రం కొంచెం ఆందోళనకరంగా మారింది. గత కొన్ని రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. తూర్పు గోదావరిలో 83,852 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 55,670 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.