Begin typing your search above and press return to search.
తెలంగాణలో రికార్డులు సృష్టిస్తున్న కేసులు: ఒక్కరోజే 872 పాజిటివ్
By: Tupaki Desk | 22 Jun 2020 5:26 PM GMTమహమ్మారి వైరస్ తెలంగాణలో కల్లోలం సృష్టిస్తోంది. రికార్డుల మేర కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఏడు వందలు దాటిన కేసులు తాజాగా తొమ్మిది వందలకు చేరువయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 872 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇవి కేవలం 3,189 మందికి పరీక్షలు చేయడంతో నిర్ధారణ అయిన కేసులు. ఏడుగురు మృతిచెందారు. కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా వాటితో కలిపి మొత్తం కేసులు 8,674కి చేరాయి. తాజాగా కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారు 274 మంది. వీరితో కలిపి కోలుకొని ఇళ్లకు వెళ్లినవారు 4,005 మంది. మొత్తం మృతుల సంఖ్య 217గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు టెస్టులు చేసిన సంఖ్య 60,243.
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 4,452 ఉన్నాయి. తాజా కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 ఉండడం హైదరాబాద్‌వాసులను భయాందోళన రేపుతోంది. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 713, రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్‌లో 16, సంగారెడ్డిలో 12, వరంగల్ రూరల్ జిల్లా 6, మంచిర్యాలలో 5, కామారెడ్డి ౩, మెదక్ జిల్లాలో ౩, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలో 2 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.