Begin typing your search above and press return to search.
తెలంగాణ అప్డేట్ : 1,198 పాజిటివ్.. ఏడుగురి మృతి
By: Tupaki Desk | 20 July 2020 5:31 PM GMTమహమ్మారి వైరస్ తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది. వారం రోజులుగా వెయ్యిన్నర లోపు కేసులు నమోదవుతున్నాయి. గతంలో దాదాపు రెండు వేలకు చేరువలో కేసులు నమోదైన పరిస్థితి నుంచి ఆ సంఖ్య కొంత తగ్గిందని చెప్పవచ్చు. దానికి ఉదాహరణే తాజాగా నమోదైన కేసులు. కొత్తగా శనివారం 1,198 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. తాజా వాటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 46,274కు చేరగా మృతుల సంఖ్య 422కి చేరింది.
వైరస్ నుంచి కోలుకుని తాజాగా 1,885 మంది డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి డిశ్చార్జయిన వారి సంఖ్య 34,323. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 11,003. కొత్తగా టెస్టులు 14,883 చేశారు. ఇప్పటివరకు చేసిన టెస్టులు 2,76,222.
మహమ్మారి జిల్లాల్లో తీవ్రంగా వ్యాపిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో తగ్గుతున్న కేసులు గ్రామీణ ప్రాంతాల్లో పెరగడం ఆందోళన రేపుతోంది. తాజా బులెటిన్ అదే నిరూపిస్తోంది. జీహెచ్ఎంసీ లో 510 కేసులు నమోదవగా రంగారెడ్డి జిల్లాలో 106.. కరీంనగర్ 87.. మేడ్చల్ జిల్లా 76.. వరంగల్ అర్బన్ 73.. మహబూబ్ నగర్ 50.. ఇలా జిల్లాల్లో వైరస్ తీవ్ర స్థాయిలో ప్రబలుతోంది.