Begin typing your search above and press return to search.
ఏపీలో 500 దాటాయి.. కొత్తగా 605 కేసులు
By: Tupaki Desk | 26 Jun 2020 1:05 PM GMTవైరస్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా ఉంది. ఇన్నాళ్లు ఒకే సంఖ్యలో నమోదవుతున్న కేసులు రెండు రోజుల నుంచి పెరుగుతున్నాయి. నిన్న 500 మార్క్ దాటగా తాజాగా 600 దాటాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. శుక్రవారం వైద్యారోగ్య శాఖ ప్రకటించిన హెల్త్ బులిటిన్ ప్రకారం.. 605 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్కరోజే 22,305 నమూనాలు పరీక్షించగా రాష్ట్రానికి సంబంధించి 570.. ఇతర రాష్ట్రాల వారివి 34.. ఇతర దేశాలకు చెందిన ఒకరికి పాజిటివ్ తేలింది. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 11,489కి చేరింది.
అయితే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్కరోజే వైరస్‌తో 10 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 146కి చేరింది. తాజాగా వైరస్ నుంచి కోలుకున్న వారు 191 మంది డిశ్చార్జయ్యారు. ఈ వైరస్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,169 నమోదయ్యింది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 6,147 మంది.
ఈరోజు అత్యధిక కేసుల్లో వైఎస్సార్ కడప జిల్లా నిలిచింది. ఆ జిల్లాలో 133 కేసులు నమోదవగా అనంతపురము జిల్లాలో 79, పశ్చిమగోదావరి జిల్లాలో 79 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి.
కర్నూలు 1,615
కృష్ణా 1,199
అనంతపురము 1,159
గుంటూరు 1,032
తూర్పుగోదావరి 836
పశ్చిమగోదావరి 760
చిత్తూరు 725
నెల్లూరు 537
వైఎస్సార్ కడప 633
విశాఖపట్నం 427
ప్రకాశం 246
విజయనగరం 122
శ్రీకాకుళం 62