Begin typing your search above and press return to search.
అమెరికాను వణికించేస్తున్న కరోనా సెకండ్ వేవ్
By: Tupaki Desk | 11 Dec 2020 11:30 AM GMTకరోనా వైరస్ సెకండ్ వేవ్ అగ్రరాజ్యం అమెరికాను వణికించేస్తోంది. గురువారం ఒక్కరోజే అగ్రరాజ్యంలో 3054 మంది కరోనా మహమ్మారికి బలైపోయారు. అమెరికా చరిత్రలో ఒక్కరోజులో ఇంతమంది మరణించటం ఇదే మొదటాసారి కావటం సంచలనంగా మారింది. గతంలో కూడా కరోనా వల్ల చాలామంది మరణించారు. అయితే గతంలో ఒక్కరోజులోనే వైరస్ కారణంగా మరణించిన వారిసంఖ్య 2769. అప్పట్లోనే ఇంతమంది మరణించటం అమెరికాలో కలకలం రేపింది. అందుకనే అప్పటికంటే ఇపుడు అదనంగా సుమారు 300 మంది మరణించటంతో అమెరికా వణికిపోతోంది.
నిజంగా చెప్పాలంటే అమెరికాలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్ధంగా తయారైంది. దీనికి ప్రధాన కారణంగా ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలనే చెప్పాలి. కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న సమయంలోనే అమెరికా ఎన్నికలు జరిగాయి. మొదట్లో బాగా పెరిగి మళ్ళీ తగ్గాయి. కానీ రెండోసారి మళ్ళీ పెరుగుతున్నాయని అనుకుంటున్న నేపధ్యంలోనే ఎన్నికలు జరగటంతో విస్తరణ ఒక్కసారిగా పెరిగిపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు నిర్వహించిన బహిరంగసభల వల్లే సుమారు 40 వేల మందికి కరోనా సోకిందనే వార్త అప్పట్లో సంచలనంగా మారింది.
మళ్ళీ అప్పటి నుండి రోజురోజుకు సమస్య పెరుగుతునే ఉంది. మొత్తం అమెరికాలో ఇఫ్పటివరకు 1.6 కోట్లమందికి కరోనా వైరస్ సోకితే 2.97 లక్షల మంది చనిపోయారు. ఒక వ్యాధి కారణంగా అమెరికాలో ఇన్ని లక్షల మంది మరణించటం ఇదే మొదటిసారేమో. యావత్ ప్రపంచంలో తమ దగ్గరే అత్యుత్తమైన వైద్య సదుపాయాలున్నాయని గర్వంగా చెప్పుకునే అమెరికా కూడా కరోనా వైరస్ దెబ్బకు తలొంచేసింది.
మొన్నటి బుధవారం అమెరికా మొత్తం మీద 18 లక్షల మందికి వైరస్ నిర్ధారిత పరీక్షలు చూస్తే 2.15 లక్షల మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వీరిలో కేవలం లక్షమందిని మాత్రమే ఆసుపత్రుల్లో చేర్చుకున్నారు. మిగిలిన వారిని చేర్చుకునే అవకాశాలు లేకపోవటంతో ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్లు పంపేశారు. అంటే అగ్రరాజ్యంలో పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో దీన్నిబట్టి అర్ధమవుతోంది.
కరోనా వైరస్ యాంటీ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న ఫైజర్ సహకారంతో ఈనెలాఖరుకు అమెరికాలోని 2 కోట్లమందికి టీకాలు ఇవ్వగలమని హెల్త్ డైరెక్టర్ అలెక్స్ హజార్ ఆశాభావంతో ఉన్నారు. జనవరి మొదట్లో 5 కోట్లమందికి, నెలాఖరులోగా మరో 10 కోట్లమందికి టీకాలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు హజర్ తెలిపారు. ఏదేమైనా కరోనా వైరస్ దెబ్బకు అభివృద్ది చెందుతున్న, పేద దేశాలే కాదు అభివృద్ధిలో ఎంతో ముందున్నామనుకునే అమెరికా కూడా తల్లక్రిందులైపోయింది.