Begin typing your search above and press return to search.

లేటెస్ట్ అప్డేట్ : భారత్‌లో 40వేలు దాటిన కరోనా మరణాలు..కొత్తగా ఎన్నంటే

By:  Tupaki Desk   |   6 Aug 2020 9:30 AM GMT
లేటెస్ట్ అప్డేట్ : భారత్‌లో 40వేలు దాటిన కరోనా మరణాలు..కొత్తగా  ఎన్నంటే
X
దేశంలో నమోదు అయ్యే కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. గత కొన్ని రోజులుగా ప్రతీ రోజూ కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 56,282 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 904 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,64,537కి చేరుకుంది.

ఇందులో 5,95,501 యాక్టివ్ కేసులు ఉండగా.. 40,699 మంది కరోనాతో మరణించారు. అలాగే, 13,28,337 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,21,49,351 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,64,949 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. ఇదిలా ఉంటే దేశంలో వరుసగా ఎనిమిదో రోజు 50,000 పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఎక్కువగా మహారాష్ట్ర, న్యూఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే రోజూ 5 వేలు పైచిలుక కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించాయి. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 67.62 శాతంలో ఉండగా.. డెత్ రేట్ 2.07 శాతంలో ఉంది.

ఇక , తెలంగాణలో బుధవారం నాడు 2,092 కొత్త కరోనా కేసులు వచ్చాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,050కు చేరుకుందని ఈ ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న 13 మంది వైరస్ కారణంగా మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 589కి పెరిగిందని వెల్లడించింది.

ఏపీ విషయానికొస్తే .. ఏపీలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న కేసుల రాష్ట్రాల్లో ఏపీ కూడా చేరిపోయింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,128 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,86,461కి చేరింది.