Begin typing your search above and press return to search.

తస్మాత్ జాగ్రత్త..కరోనాతో గుండె సమస్యలు లేనివారికి కూడా ఎఫెక్ట్

By:  Tupaki Desk   |   3 Nov 2020 11:30 AM GMT
తస్మాత్ జాగ్రత్త..కరోనాతో గుండె సమస్యలు లేనివారికి కూడా ఎఫెక్ట్
X
కరోనా కలకలం కాస్త తగ్గింది.. అనుకుంటుండగా చాలా దేశాల్లో మళ్లీ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో మళ్లీ ఆంక్షలు పాటిస్తున్నారు. లాక్ డౌన్లు అమలు చేస్తున్నారు. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు వైద్య నిపుణులు అహోరాత్రులు శ్రమిస్తూనే ఉన్నారు. వ్యాధి గురించి శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. ఈ పరిశోధనల్లో కరోనాకు సంబంధించిన కొత్త కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఇవి మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కోవిడ్ కారణంగా శ్వాస వ్యవస్థ

తీవ్రంగా దెబ్బ తింటోన్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు వచ్చి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. కరోనా మహమ్మారి గుండె పై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. దీంతో పాటు ఇతర అవయవాల పనితీరు పై కూడా కరోనా ప్రభావం చూపిస్తోందని వెల్లడించారు.

చికాగో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఊపిరితిత్తులపై కరోనా దాడి చేయడం వల్ల దాని ప్రభావం గుండె పై పడుతోందని వైద్య నిపుణుల అధ్యయనంలో తేలింది. కరోనా గుండె కండరాలపై డైరెక్టుగానే దాడి చేస్తోందని..ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఈ అధ్యయనం సేకరించింది. కరోనా రోగుల్లో దాదాపు 25 నుంచి 30 శాతం మందిలో గుండె సంబంధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతే కాదు మహమ్మారి దాడి వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది వరకు గుండెకు సంబంధించిన సమస్యలు లేని వారికి కూడా కరోనా వల్ల అలాంటి సమస్యలు వస్తున్నట్లు వైద్యుల అధ్యయనంలో తేలింది. ఒకసారి మహమ్మారి సోకితే అది అవయవాలపై ఎన్నిరోజులు దాడి చేస్తుందనే అంశంపై పరిశోధన కొనసాగిస్తున్నట్లు శాస్త్రవేత్త సీన్‌ పిన్నేయ్ తెలిపారు.