Begin typing your search above and press return to search.

ఇద్దరికీ కరోనా వైరస్ భలే కలిసొచ్చిందే

By:  Tupaki Desk   |   19 Dec 2020 1:30 AM GMT
ఇద్దరికీ కరోనా వైరస్ భలే కలిసొచ్చిందే
X
ఒకే అంశంపై రెండు వర్గాలూ అడ్వాంటేజ్ పొందటం అంటే చాలా అరుదుగా దొరుకుతుంది. మామూలుగా ఒక అంశంపై ఒక వర్గం అడ్వాంటేజ్ తీసుకుంటే ఇక రెండో వర్గం అదే అంశం జోలికి పోదు. కానీ ఇక్కడ ఇదే అంశం రెండో వర్గానికి కూడా అడ్వాంటేజ్ గా మారిపోయింది. అంటే ఒకసారి ఓ వర్గానికి పనికివస్తే కొంతకాలం తర్వాత మరో వర్గానికి పనికిరావటం నిజంగా విచిత్రంగానే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటారా ? అదేనండి కరోనా వైరస్ గురించే ఇదంతా.

స్ధానిక సంస్ధల ఎన్నికలలను వాయిదా వేయటానికి మొన్నటి మార్చిలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ కరోనా వైరస్ భలేగా ఉపయోగపడింది. ఆ తర్వాత దాని ఫాలోఅప్ గా ఎంత గొడవ జరిగిందో అందరికీ తెలిసిందే. ఏ ముహూర్తంలో స్ధానిక సంస్దల ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేశారో అప్పటి నుండి రాష్ట్రప్రభుత్వం-నిమ్మగడ్డ మధ్య గొడవలే గొడవలు.

సరే ఇక ప్రస్తుతానికి వస్తే వచ్చే ఫిబ్రవరిలో వాయిదాపడిన స్ధానికసంస్దల ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ డిసైడ్ అయ్యారు. తన వాదనకు మద్దతుగా రాజకీయపార్టీలతో సమావేశం కూడా నిర్వహించేశారు. అయితే ఏ కరోనా వైరస్ ను అయితే నిమ్మగడ్డ సాకుగా చూపించి ఎన్నికలను వాయిదా వేశారో ఇపుడదే కరోనాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటోంది.

అంటే మార్చిలో నిమ్మగడ్డకు ఉపయోగపడిన కరోనా వైరస్ డిసెంబర్ కు వచ్చేసరికి ఎన్నికలు జరక్కుండా ప్రభుత్వానికి కూడా సాకుగా దొరకటం విచిత్రంగా లేదు. నిజానికి ఎన్నికలను వాయిదా వేసిన సమయానికి రాష్ట్రంలో పెద్దగా కరోనా వైరస్ లేదనే చెప్పాలి. అయినా ప్రజల ప్రాణాలని కాపాడేందుకని, సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యతని మాట్లాడేశారు నిమ్మగడ్డ.

ఫిబ్రవరిలో ఎన్నికలను జరిపేందుకు ఇష్టపడి ప్రభుత్వం కూడా ఇపుడు అవే మాటలు చెబుతోంది. పైగా జనవరి 15 నుండి మార్చి 15లోగా కరోనా మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉందన్న ప్రపంచ ఆరోగ్యసంస్ధ, కేంద్రప్రభుత్వ హెచ్చరికలను కోర్టులో అఫిడవిట్ లో ప్రస్తావించింది. అలాగే కరోనా వ్యాక్సిన్ వేయటంలో యంత్రాంగం అంతా బిజీగా ఉంటారు కాబట్టి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పేసింది. చూద్దాం కోర్టేమంటుందో.