Begin typing your search above and press return to search.

కరోనా సెకండ్​ వేవ్​.. ఇండియాలోనూ మొదలైందా? దేశ రాజధానిలో పెరుగుతున్న కేసులు!

By:  Tupaki Desk   |   5 Nov 2020 12:30 AM GMT
కరోనా సెకండ్​ వేవ్​.. ఇండియాలోనూ మొదలైందా? దేశ రాజధానిలో పెరుగుతున్న కేసులు!
X
కరోనా సెకండ్​వేవ్​ అమెరికా, యూరోప్​ దేశాలను వణికిస్తున్నది. అయితే తాజాగా కరోనా మహమ్మారి మనదేశంలోనూ మొదలైందన్న ప్రచారం ఊపందుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో సెకండ్​ వేవ్​ వచ్చేస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో గతంలో తగ్గినట్లు కనిపించిన కేసులు.. కొన్ని రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా వైరస్​ వ్యాప్తి తీవ్రమైంది. ఇటీవల ఢిల్లీలో రోజువారి కేసులు 6వేలను దాటేసాయి. ఢిల్లీలో కేసులు తగ్గాయని ప్రజలంతా ఊపిరితీసుకుంటున్న తరుణంలో పెరుగుతున్న కేసుల సంఖ్య తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ మధ్యకాలంలో రోజువారీ కేసుల సంఖ్య 6000 మార్కును దాటడం ఇదే మొదటిసారి.

తాజాగా 6 వేల 700 కొత్త కేసులు నమోదు కావడంతో ఢిల్లీలో మొత్తం కరోనా సంఖ్య 4 లక్షలను అధిగమించింది. అక్టోబర్​ 30 న ఢిల్లీలో ఐదువేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుతున్నాయి. ఈ విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది సెకండ్​ వేవ్​ కాదు.. థ‌ర్డ్ వేవ్‌. పండుగ సీజన్, కాలుష్య స్థాయి పెరుగుతుండటంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఢిల్లీ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కరోనా కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటాం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.