Begin typing your search above and press return to search.
కళ్ళద్దాలపై 9 రోజుల పాటు కరోనా ఉంటుందట !
By: Tupaki Desk | 31 Aug 2020 10:10 AM GMTప్రస్తుతం ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది ఈ కరోనా మహమ్మారి. కరోనా మహమ్మారి ధాటికి ఇప్పటికే అనేక దేశాల్లో వేలాదిమంది మృత్యువాత పడ్డారు. లక్షలాది ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. వేలాది మంది కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వైరస్ విషయంలో జరుగుతున్న పరిశోధనల్లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జలుబు దగ్గు, జ్వరం కాకుండా ఇప్పటికే ఎన్నో రకాల లక్షణాలు కరోనా వైరస్ లక్షణాల్లో చేరాయి. అయితే ఈ వైరస్ వస్తువులపైన ఒంటిపైన వస్తువులపైన ఎంతసేపు బతికి ఉంటుందో అన్న వివరాల్ని కూడా అనేకమంది నిపుణులు వెల్లడించారు.
ఏ వస్తువుపై కరోనా వైరస్ ఎంతకాలం బతికి ఉంటుందనే విషయంపై ఇప్పటికే యానిసెఫ్ కొన్ని విషయాలను వెల్లడించింది. గాలిలో నుంచి వైరస్ ఎక్కువ దూరం ప్రయాణం చేయలేదని, వస్తువులపై వైరస్ 12 గంటల కంటే ఎక్కువ కాలం బతికి ఉండలేదని చెప్పిన సంగతి తెలిసిందే. బట్టలపై 9 గంటల పాటు వైరస్ బతుకుతుంది. రెండు గంటలు ఎండలో ఆ బట్టలను పెడితే వైరస్ చచ్చిపోతుందన్నారు.
ఇక ఇలాగ ఉంటే, తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించారు డాక్టర్లు. మాస్కులతో నోరు, ముక్కును కవర్ చేసుకున్నట్లుగానే కండ్లను కవర్ చేయడానికి అద్దాలు అంతే అవసరం. కండ్ల అద్దాలపై వైరస్ 9 రోజుల వరకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అందుకే వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలని హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలోని కంటి వైద్య నిపుణుడు అక్షయ్ తెలిపారు. అయితే కండ్లద్దాలను ఆల్కహాల్ శానిటైజర్లతో శుభ్రం చేయవద్దని, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడితే మంచిదని ఆయన సూచించారు.