Begin typing your search above and press return to search.
ఐపీఎల్ పై కరోనా ప్రభావం మొదలైంది .. ఆర్ ఆర్ ఫీల్డింగ్ కోచ్ కు పాజిటివ్ !
By: Tupaki Desk | 12 Aug 2020 11:30 PM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 .. ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ లో కరోనా కలకలం రేగింది. రాజస్థాన్ రాయల్స్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో యాగ్నిక్ కు 14 రోజుల క్వారంటైన్ విధించారు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం ట్విట్టర్ అకౌంట్ ద్వారా అఫీషియల్ గా ఖరారు చేశారు. యాగ్నిక్ తో కలిసి పనిచేసిన అందరూ కరోనా టెస్టులు చేయించుకుని ఐసోలేషన్ లో ఉండాలని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కోరింది.
ఐపీఎల్ 13వ సీజన్ ను యూఏఈలో ఆడేందుకు ఆమోదం తెలిపినట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సోమవారం ప్రకటించారు. ఆలా ప్రకటించిన రెండు రోజులకే కరోనా కలకలం రేగడంతో ఇప్పుడు ఆందోళన మొదలైంది. సెప్టెంబర్ 19నుంచి నవంబరు 10వరకూ మూడు సిటీలు షార్జా, అబు దాబి, దుబాయ్ లలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించబోతున్నారు. భారత్ లో కరోనా తీవ్రస్థాయిలో ఉండటం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ను యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించడం తెలిసిందే