Begin typing your search above and press return to search.
చరిత్ర పునరావృతం: కశ్మీరీ వ్యాలీని వీడుతోన్న పండిట్లు
By: Tupaki Desk | 9 Oct 2021 2:31 PM GMT23చరిత్ర పునరావృతమవుతోంది. 1990లలో ఎలాంటి సీన్లు చోటు చేసుకున్నాయో.. ముప్ఫై ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి సీనే కశ్మీర్ లో చోటు చేసుకుంటోంది. గడిచిన వారం వ్యవధిలో ఉగ్రమూకలు.. తమ అలవాటుకు భిన్నంగా కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకొని అమానుషంగా చంపేస్తున్నారు. తొంభైలలోనూ ఇలానే జరగటం.. వేలాది మంది కశ్మీరీ వ్యాలీని విడిచిపెట్టి వెళ్లిపోవటం తెలిసిందే. ఆ సమయంలో మీడియా ఈ ఉదంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదన్న మాట వినిపించేది.
ఇప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా ఉంది. వీటికి తోడు వాట్సాప్ లాంటి మాధ్యమాలు ఉన్నాయి. పలు వేదికల మీద జరుగుతున్న అమానుషాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. బ్యాడ్ లక్ ఏమంటే.. తాజాగా చోటు చేసుకుంటున్న ఉదంతాల మీద మీడియాలో వార్తలు కవర్ అవుతున్నా.. అవ్వాల్సిన స్థాయిలో మాత్రం కావటం లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
కశ్మీరీ లోయలో మైనార్టీలుగా ఉన్న పండిట్లకు సరైన రక్షణ కల్పించటం.. వారిపై దాడికి తెగబడుతున్న వారి విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ జరగని పరిస్థితి. ఎందుకిలా జరుగుతోంది? అన్నది ఇప్పుడు ప్రశ్న. మోడీ సర్కారు మీద ఒత్తిడిని తీసుకురావటంతో పాటు.. కశ్మీర్ విషయంలో భారత సర్కారు సరైన రీతిలో రియాక్టు కాలేకపోతున్నదన్న భావన కలిగించటం కూడా ఉగ్రవాదుల లక్ష్యంగా ఉంది. ఇంతకాలం మోడీకి దన్నుగా నిలిచిన వారు సైతం ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత పెంచే వ్యూహం కూడా ఉందన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా కశ్మీరీ వ్యాలీలో ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయానికి వస్తే.. మైనార్టీలుగా ఉన్న హిందువులు.. సిక్కులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరగటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వారం వ్యవధిలోనే పలువురు హిందువులు.. సిక్కులపై వ్యక్తిగత దాడులు జరగటం.. ఐడెంటిటీ కార్డుల్ని చెక్ చేసి మరీ.. వారిని చంపేయటంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది.
దీనిపౌ పెద్దఎత్తున ఆందోళనతో కశ్మీరీ పండిట్ కుటుంబాలు శుక్రవారం లోయ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నాయి. గతంలో ఉగ్రదాడుల భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన కశ్మీరీ పండిట్లను తిరిగి తెచ్చేందుకు 2003లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలా వచ్చిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ.. అందుకు భిన్నంగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పదుల సంఖ్యలో పండిట్ల కుటుంబాలు కశ్మీర్ ను విడిచి పెట్టి వెళ్లిపోవటం గమనార్హం.
తాజాగా జరుగుతున్న హత్యాకాండ నేపథ్యంలో పండిట్లు తాము ఉన్న నివాసిత ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్నా.. కాలనీ దాటి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ బయటకు వస్తే.. ఎప్పుడు ఎవరు.. ఎక్కడ హత్య చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అన్ని వేళలా ఇళ్లల్లో ఉండటం సాధ్యం కాదని.. ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుందని.. అలాంటప్పుడు సెక్యురిటీ సమస్యే కదా? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుడ్గాం.. అనంత్ నాగ్.. పుల్వామా తదితర ప్రాంతాల నుంచి 500 మంది కశ్మీరీ పండిట్లు వలస పోతున్నట్లుగా చెబుతున్నారు. తాజా పరిస్థితి చూస్తుంటే.. 1990 నాటి పరిస్థితులు మళ్లీ దాపురించినట్లుగా పండిట్ల సమాఖ్య వాపోతోంది. మోడీ ప్రధానిగా ఉన్న వేళలోనూ ఇలాంటి పరిస్థితా? అన్న పెదవి విరుపు మాటలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఈ విషయంలో మోడీ సర్కారు ఏం చేయనుందన్న పెద్ద ప్రశ్నగా మారింది.